
తెలంగాణ యూనివర్సిటీ లోని బాలుర ,బాలికల హాస్టల్ ను తెలంగాణ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ డాక్టర్ యాదగిరి సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. హాస్టలను పరిశుభ్రంగా ఉంచాలని సిబ్బందికి ఆదేశించారు. విద్యార్థులు, సిబ్బంది తో మాట్లాడి హాస్టల్స్ లో నేలకోని ఉన్న సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కర మార్గాలను పరిష్కరించారు. రిజిస్ట్రార్ వెంట హాస్టల్ చీఫ్ వార్డెన్ డాక్టర్. మహేందర్, అసిస్టెంట్ ఇంజనీర్ వినోద్ కుమార్, ఎస్టేట్ ఆఫీసర్స్ అశోక్ వర్ధన్ రెడ్డి, యాదగిరి అసిస్టెంట్ వార్డేన్లు గంగా కిషన్, డాక్టర్ కిరణ్ రాథోడ్, డాక్టర్ రాజేశ్వరి, కేర్ టెకర్స్ క్రాంతి ,చౌహన్ ,రమేష్ ,పీరు ఉన్నారు.