
మండలంలోని పలు గ్రామాల్లో అమ్మ ఆదర్శ పాఠశాల కార్యక్రమంలో భాగంగా చేపడుతున్న పనులను కమ్మర్ పల్లి ఎంపీడీవో రాజ శ్రీనివాస్, ఏపీఎం కుంట గంగాధర్ లు సోమవారం సందర్శించారు. మండలంలోని కొత్తచెరువు తాండ, వాసం గట్టు తాండ, ఇనాయత్ నగర్, నర్సాపూర్ గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో చేపడుతున్న గదుల మరమ్మత్తు, మరుగుదొడ్లు మరమ్మత్తు, తాగునీటి సౌకర్యం, విద్యుదీకరణ పనుల తీరును పరిశీలించారు. జరుగుతున్న పనుల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ నెల 30 తేదీలోపు పనులన్నీ వంద శాతం పూర్తి చేయాలని ఎంపీడీవో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిసి శ్రీనివాస్, ఆయా గ్రామాల పంచాయతీ కార్యదర్శులు, తదితరులు పాల్గొన్నారు.