జుక్కల్ పోలింగ్ కేంద్రాలను పరీశీలన..

నవతెలంగాణ – జుక్కల్: మండల  కేంద్రం లోని జిల్లా పరిషత్ పాఠశాలలోని మూడు, గ్రామ పంచాయతి కార్యాలయంలో ఉన్న పోలింగ్ బూత్ లలో  జర్గుతున్న  ఎన్నికల తీరపతెన్నులను జుక్కల్  నియేాజక  కాంగ్రేస్  పార్టీీ అబ్యర్థి తోట లక్ష్మీకాంతారావ్ పరీశీలించారు. ఈ సంధర్భంగా పోలింగ్  బూత్ విధులు నిర్వహిస్తున్న అధికారులకు ఎన్నిక పర్సేంటిజిలను, వివి ప్యాడ్ పనితీరు, ఎవైన సమస్యలు తలెత్తాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలోని సరిహద్దు గ్రామం సోపూర్ లో కూడా ఎన్నికల తీరును పరీశీలన చేసారు. ఆయనతో పాటు సోపూర్ కాంగ్రేస్ నాయకుడు శీవాజీ పటేల్ , తదితరులు ఉన్నారు.