కొనసాగుతున్న చెక్‌పోస్టుల తనిఖీ

– అదనపు కలెక్టర్‌ లింగ్యా నాయక్‌
నవతెలంగాణ-కొడంగల్‌
తెలంగాణ, కర్ణాటక సరిహద్దున చంద్రకల్‌, కస్తూరి పల్లి వద్ద కొనసాగుతున్న చెక్‌ పోస్ట్‌ కేంద్రాలను, సమస్య ఆత్మక పోలింగ్‌ కేంద్రాలను అదనపు కలెక్టర్‌ లింగ్యానా యక్‌, డిఎస్పి కరుణా సాగర్‌ రెడ్డిలు శనివారం తనిఖీ చేశారు. చెక్‌పోస్ట్‌ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న తీరును గమనించారు. విధుల్లో ఉన్న వివిధ శాఖల అధి కారులు, సిబ్బంది గురించి ఆరా తీశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్‌ మాట్లాడుతూ..ఎన్నికలను దృష్టిలో పెట్టు కొని అంతరాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టులు ఏర్పాటు చేశామ న్నారు. చెక్‌పోస్ట్‌లు, ఎన్నికలు ముగిసేంతవరకుపై చెక్‌ పోస్టులలో నిరంతరం 24 గంటల పాటు తనిఖీలు నిర్వ హిస్తారన్నారు. పోలీస్‌, రెవెన్యూ, రవాణా, వాణిజ్య ప న్నులు, ఎక్సైజ్‌ తదితర శాఖలు ఉమ్మడిగా తనిఖీలు జరు పుతాయన్నారు. ఇతర రాష్ట్రాల నుండి వచ్చే ప్రతి వాహ నాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేస్తారని, అక్రమ మద్యం, నగదు వంటి వాటిని గుర్తించి సీజ్‌ చేస్తారని చెప్పారు. అయితే తనిఖీల వల్ల సాధారణ ప్రజలకు ఇబ్బందులు కలగకుం డా చర్యలు తీసుకున్నా మని తెలిపారు. ప్రజలు ఎవరైనా నగదును వెంటబెట్టు కొని ప్రయాణాలు చేయాల్సి వస్తే సరైన ఆధారాలు కలిగి ఉండాలని సూచించారు. ఆధా రాలు లేనట్లయితే నగదు జప్తు చేస్తారని అన్నారు. ఓటర్ల ను ప్రలోభాలకు గురి చేయకుండా ఉండేందుకు ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అన్ని నియోజకవర్గాల్లో ఫ్లయిం గ్‌ స్క్వాడ్‌ బందాలతో గట్టి నిఘా ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి తూచా తప్పకుండా అమలయ్యేలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నామని అన్నారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్‌ విజరు కుమార్‌, సీఐ రాములు, డిప్యూటీ తహసీల్దార్‌ సురేష్‌ కుమార్‌, ఎస్సై భరత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.