గ్రామాల్లో పోలింగ్ కేంద్రాల పరిశీలన..

Inspection of polling centers in villages.నవతెలంగాణ – కమ్మర్ పల్లి 
మండలంలోని పలు గ్రామాల్లో గతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ మంగళవారం సందర్శించి పరిశీలించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణలో భాగంగా గతంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాల్లో ప్రస్తుత పరిస్థితులను ఆయన పరిశీలించారు. కోన సముందర్ జిల్లా పరిషత్ ఉన్నత, ఉప్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, రాజరాజేశ్వరీ నగర్ ప్రాథమిక పాఠశాల, బషీరాబాద్, చౌట్ పల్లి జిల్లా పరిషత్ ఉన్నత, ప్రాథమిక పాఠశాలల్లో గ్రామ పంచాయితీ ఎన్నికల కోసం ఇదివరకు గుర్తించిన పోలింగ్ కేంద్రాల గదులను ఆయన పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయా పోలింగ్ కేంద్రాల గదుల్లో ఏర్పాట్లను పరిశీలించి పంచాయతీ కార్యదర్శులకు పలు సలహాలు, సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాలు ఉన్న పాఠశాలల్లో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని పాఠశాలల ప్రధానోపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.పోలింగ్ కేంద్రాల్లో విద్యుత్, ఇతర సమస్యలు ఏమైనా ఉంటే వెంటనే చేయించాలని కార్యదర్శులకు సూచించారు.  కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు  నరేందర్, రాఘవేందర్, శ్రీనివాస్, అనిల్, ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.