విత్తన దుకాణాల తనిఖీ

నవతెలంగాణ-కొడంగల్‌
మండల కేంద్రంలోని విత్తనాల దుకాణలలో వ్యవసా యశాఖ ఏడీఏ శంకర్‌ రాథోడ్‌, ఎస్సై రవి గౌడ్‌, ఏవో బాలాజీ ప్రసాద్‌లు శుక్రవారం తనిఖీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎరువులు, విత్తనాలు, పురుగు మందులు అమ్మే దుకాణదారులు వానకాలం ప్రారంభం కావడంతో రైతులకు నకిలీ, లూజ్‌ విత్తనాలు అమ్మినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుని, లైసె న్సులు రద్దు చేస్తామన్నారు. నాణ్యమైన కంపెనీ ద్వారా కొనుగోలు చేసిన విత్తనాలను మాత్రమే రైతులకు అమ్మా లన్నారు. రైతులు విత్తనాలు కొన్న తర్వాత రసీదును జాగ్రత్తగా ఉంచుకోవాలన్నారు. సమయం దాటిన విత్తనాలను డీలర్లు రైతులకు అమ్మితే చట్టపరమైన చర్య లు తీసుకుంటామన్నారు. కొంత సమయం వరకు నిషేధించినటువంటి గ్లైపోసిట్‌ కలుపు మందు అమ్మ కూడదన్నారు. తెల్లగుడ్డ సంచులలో సరియైన లేబుల్‌ లేకుండా ఉన్నటువంటి పత్తి విత్తనాలను రైతులకు అమ్మ కూడదన్నారు. డీలర్ల ద్వారా విత్తనాలను కొన్న తర్వాత ఇచ్చిన ఇన్వాయిస్‌ను భద్రపరుచుకోవాలి అన్నారు. రైతులకు విత్తనాలు అమ్మేటప్పుడు విధిగా రైతు సంతకం తీసుకొని రసీదు ఇవ్వాలన్నారు. డీలర్లు పొరపాటు చేసినట్లుగా తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామ న్నారు. కార్యక్రమంలో బిటియం బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.