శ్రీ శారదాంబ పారాబైలు రైస్ మిల్లును అధికారులు తనిఖీ నిర్వ హించారు. సోమవారం మండలం లోని ఎల్లారెడ్డిపేట గ్రామ శివారులో గల శ్రీ శార దాంబ పారాబైలు రైస్ మిల్లు తనిఖీ నిర్వహించా రు. సేకరించిన ధాన్యం నిలువలు, రికార్డులను పరిశీలించారు. రైస్ మిల్లు యాజమానికి తగు సూచనలు చేశారు. ఈ తనిఖీలో గజ్వేల్ రెవెన్యూ డివిజనల్ అధికారి బన్సీలాల్, వర్గల్ తహసీల్దార్ బాలరాజు, స్థానిక తహసీల్దార్ శ్రీకాంత్, తొగుట ఎస్సై రవికాంతరావు, సివిల్ సప్లై డిటి స్వామి, ఆర్ఐ అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు.