తాడిచెర్ల కోల్ మైనింగ్ తనిఖీ

Inspection of Tadicherla Coal Miningనవతెలంగాణ – మల్హర్ రావు:-
మండల కేంద్రమైన తాడిచర్ల ఓసిపి బ్లాక్-1లో సోమవారం మినిస్ట్రీ ఆఫ్ కోల్ ఆధ్వర్యంలో స్టార్ రేటింగ్ తరఫున తనిఖీ బృందం కోల్ బ్లాక్ ఓపెన్ కాస్ట్ మైన్ తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీ బృందంలో డి.వి. సుబ్రహ్మణ్యం ఓఎస్డీ,సిసిఓ కొత్తగూడం అవినాష్ శుక్ల ,ఓసిసిడి బిలాస్పూర్,.అజయ్ పటేల్ ఎన్ ఐ టి ,వరంగల్ అసోసియేట్ ప్రొఫెసర్, కే.రఘు కుమార్ జనరల్ మేనేజర్ సేఫ్టీ పి. మోహన్ రావు జనరల్ మేనేజర్ మైన్స్ టీజీ జెన్కో, హైదరాబాద్ ఇన్స్పెక్షన్ నిర్వహించారు.ఈ బృందంతో పాటు టీజీ జెన్కో ఏజెంట్. జీవకుమార్ ఈ తనికిలో పాల్గొన్నారు. ఈ తనిఖీ బృందం తాడిచర్ల వన్ కోల్ బ్లాకీ చెందిన వివిధ విభాగాలను తనిఖీ చేసి,గనిని కూడా తనిఖీ నిర్వహించారు.ఈ తనిఖీలో తాడిచెర్ల-1కోల్ బ్లాకు ఓపెన్ కాస్ట్ మైన్ పాటిస్తున్న సేఫ్టీ, ఎన్విరాన్మెంట్ ఇతర విభాగాలు పాటిస్తున్న పద్ధతులు పట్ల హర్షాన్ని వ్యక్తం చేశారు. స్టార్ రేటింగ్ ఇన్స్పెక్షన్ లో మంచి రేటింగ్ సాధించారని ఈ తనిఖి బృందం వారు తెలియపరుస్తూ ఏఎమ్మార్ బృందాన్ని అభినందించారు.