
మండలంలోని మల్లారం గ్రామపంచాయతీ పరిధిలోని దబ్బగట్టులో ప్రమాదకరంగా ఉన్న అరే వాగుపై బ్రిడ్జిని రాష్ట్ర ఐటి,పరిశ్రమల,శాసనసభ వ్యవహారాల మంత్రి దుద్దిళ్ల శ్రీదర్ బాబు ఆదేశాల మేరకు బుధవారం మంత్రి వ్యక్తిగత సహాయకులు కొక్కు ప్రవీణ్ కుమార్,ఆర్అండ్ బి ఏఈ అవినాష్, బొగ్గు తవ్వకాలు చేపట్టిన ఏఎమ్మార్ పీఆర్ఓ మల్లేష్,భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సిసెల్ అధ్యక్షుడు దండు రమేష్,యూత్ డివిజన్ నాయకుడు రాహుల్,యూత్ మండల అధ్యక్షుడు గడ్డం క్రాoతి,రూపేస్ రావు, మురళి పరిశీలించారు. పెద్దపెద్ద గంతలతో ప్రమాదకరంగా ఉన్న బ్రిడ్జిపై మరమ్మతులు చేపట్టాలని కాంగ్రెస్ నాయకులు అధికారులను కోరారు.మరమ్మతుల విషయంపై నవ తెలంగాణ ఆర్అండ్ బి ఏఈ అవినాష్ ను వివరణ కోరే ప్రయత్నం చేయగా స్పందించకపోవడం గమనార్హం.