మంత్రి శ్రీధర్ బాబు ఆదేశాలతో కాలువ మరమ్మతుకు అధికారుల పరిశీలన

Ramagiriనవతెలంగాణ-రామగిరి
రామగిరి మండలం బుధవారంపేట పరిధిలో గల ఎస్ఆర్ఎస్పి డి 83 ప్రధాన కాలువకు అనుసంధా నంగా ఉన్న 8ఎల్ ఆర్ఎస్ బి ఉపకాలువ మరమ్మత్తుల కోసం గురువారం సంబంధిత అధికారులు పరిశీలన చేశారు. వ్యవసాయ భూములకు నీరందించే 8 ఎల్ కాలువ పలు చోట్ల దెబ్బతిని చివరి ఆయకట్టు వరకు సాగు నీరు అందక రైతులు ఇబ్బందిపడుతున్న విషయాన్ని గమనించిన మాజీ సర్పంచ్ బుద్దార్థి బుచ్చయ్య పటేల్ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై వెంటనే స్పందించిన మంత్రి మరమ్మత్తులు చేసి రైతాంగాన్ని ఆదుకునేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈమేరకు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కు చెందిన ఎస్సీ సత్యరాజ్ చంద్ర, డిఈఈ బలరాం, ఏఈఎలు రాజేందర్, సుబ్బరామిరెడ్డిలు కెనాల్కు చేయవల్సిన మరమ్మత్తులను పరిశీలించి కొలతలు తీసుకున్నారు. నీరు అందక పొలాలు ఎండిపోయే పరిస్థితి నెలకొని రైతులు నష్టపోతారని గ్రహించి చివరి ఆయకట్టు వరకు నీరందించాలనే సమస్యను పరిష్కరించాలని అడిగిన వెంటనే స్పందించి పని పూర్తయ్యేందుకు ఆదేశాలు ఇచ్చిన మంత్రి శ్రీధర్ బాబుకు, మాజీ సర్పంచ్ బుద్దార్థి బుచ్చయ్య, ఎంపీపీ అరెల్లి దేవక్కకొమురయ్యగౌడ్ కు రైతులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.