మండలంలోని నాగపూర్ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో మరుగుదొడ్లను ఎంపీడీవో చింత రాజ శ్రీనివాస్ సోమవారం సందర్శించి పరిశీలించారు.ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్ల పరిస్థితి, చేపట్టాల్సిన మరమ్మత్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. మరుగుదొడ్ల మరమ్మతులకు ఎంత ఖర్చవుతుందని తెలుసుకునేందుకు స్థానిక ఆంధ్ర మేస్త్రితో మాట్లాడారు. అనంతరం పాఠశాలలో అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ ఆధ్వర్యంలో రికార్డులను పరిశీలించిన ఆయన, పాఠశాలలో సౌకర్యాలు కల్పించాల్సిన అవసరమున్న పనులపై అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులతో చర్చించారు. తక్షణం మరమ్మతులు చేపట్టాల్సిన పనులను గుర్తించి అవసరమైన నిధుల కోసం నివేదికలు సిద్ధం చేయాలని మండల విద్యాధికారి ఆంధ్రయ్యకు సూచించారు. ఆయన వెంట పంచాయతీ కార్యదర్శి సంధ్య, సీసీ నవీన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.