నవతెలంగాణ – నాగిరెడ్డిపేట్
నాగిరెడ్డిపేట మండల కేంద్రంలో కొనసాగుతున్న ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాల పనులను బుధవారం రోజు ఎంపీపీ టేకులపల్లి వినీత జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా నిర్మాణ పనుల వివరాలను కాంట్రాక్టర్ సిద్ధిరాములు అడిగి తెలుసుకున్నారు. త్వరితగతిన పనులను పూర్తి చేయాలని ఆయనకు ఆదేశించారు. పనులలో నాణ్యత లోపించకుండా చూడాలని ఆదేశించారు. కార్యక్రమంలో వారి వెంట దుర్గారెడ్డి వంశీ గౌడ్ తదితరులున్నారు.