
మండల కేంద్రం శివారులోని బ్రహ్మంగారి గుట్ట వద్ద ఏర్పాటుచేసిన అంతర్ జిల్లా చెక్ పోస్ట్ వద్ద గురువారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహించారు. లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో ఈ చెక్ పోస్ట్ ను ఏర్పాటు చేశారు. కమ్మర్ పల్లి ఎస్ఐ రాజశేఖర్ ఆధ్వర్యంలో పోలీసులు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసి వాహనానికి సంబంధించిన పత్రాలను పరిశీలించారు.వాహన యజమాని వివరాలను అడిగి తెలుసుకొని రికార్డుల్లో నమోదు చేశారు. వాహన తనిఖీల సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వీడియో గ్రాఫర్ తో వీడియో తీయించారు. అంతకుముందు చెక్ పోస్ట్ ను ఎంపీడీవో చింతరాజ శ్రీనివాస్ సందర్శించి పరిశీలించారు. ఈ సందర్భంగా చెక్ పోస్ట్ నుండి ఇరువైపులా ప్రయాణించిన వాహనాల వివరాలతో కూడిన రికార్డులను పరిశీలించారు. చెక్ పోస్ట్ వద్ద సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని, ప్రతి వాహనాన్ని క్షుణంగా తనిఖీ చేసిన అనంతరమే పంపించాలని చెక్ పోస్ట్ సిబ్బందికి ఆయన సూచించారు.