తెలంగాణ రాష్ట్ర ఇంటలిజెన్స్ డి.జి ఆదేశాలమేరకు ఐ.ఎస్.డబ్ల్యూ వారి ఆద్వర్యంలో ఇన్స్పెక్షన్ నిర్వహించాలనగా నిజామాబాద్ పోలీస్ కమీషనర్ కల్మేశ్వర్ సింగనవార్,ఐ.పి.యస్., సూచనల మేరకు నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ యందు హైదరాబాద్ నుండి వచ్చిన ఐ.ఎస్.డబ్ల్యూ (డి.యస్.పి) ఆర్.నాగేశ్వరరావు వారిబృందం ఆద్వర్యంలో పి.యస్.ఓలు, బిడి టీమ్, డాగ్ స్క్వాడ్, ఎమ్.టి విభాగాలలో ఇన్స్పెక్షన్ మంగళవారం నిర్వహించారు. ఈ సందర్బంగా సిబ్బంది విధుల నిర్వాహణ, సిబ్బంది ఫిజికల్ ఫిట్నెస్ గురించి,అన్ని రకాల పరికరాల ఉపయోగం, మెయింటనెన్స్ గురించి, డాగ్ స్క్వాడ్ యొక్క విధులు, బి.ఆర్ వాహనం మోయింటనెన్స్ గురించి పలు విషయాలపై చర్చించారు. చర్చించిన విషయాలు వాటి ఉపయోగాలు విధినిర్వహణలో ఎలాంటి అలసత్వం వహించరాదని తెలిపారు. సిబ్బందికి ఎలాంటి సందేహాలు ఉన్నను తమ పై అధికారికి ఎప్పటికప్పుడు తెలియజేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డి.సి.పి (ఎ.ఆర్ ) డి. శంకర్ నాయక్, రిజర్వు ఇన్స్పెక్టర్స్ హెచ్. సతీష్ , ఎమ్.టి.ఓ తిరుపతి, ఆర్.ఎస్.ఐ శ్రావణ్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.