
నవతెలంగాణ-సూర్యాపేట కలెక్టరేట్
లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని చెక్ పోస్ట్ లలో నిఘా పెంచామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ ఎస్. వెంకటరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎఫ్. ఎస్. టి, అలాగే ఎస్ ఎస్ టి, పోలీస్, ఎక్సైజ్ టీములు నిరంతరం ముమ్మర తనిఖీలు చేస్తున్నాయని తెలిపారు. తనిఖిలలో స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి ఇతర సామగ్రి ని కలెక్టరేట్ లోని స్ట్రాంగ్ రూమ్ లో భద్ర పరిచి తదుపరి కలెక్టరేట్ లోని గ్రీవెన్స్ సెల్ నుండి బాధితులు ఆధారాలు చూపితే తిరిగి అందచేయడం జరుగుతుందని తెలిపారు. అదేవిదంగా స్వాధీనం చేసుకున్న నగదు, బంగారం, వెండి ఇతర వస్తులకు తప్పకుండా రసీదు అందజేయాలని కలెక్టర్ తెలిపారు. బుధవారం వరకు స్వాధీనం చేసుకున్న నగదు రూ.85.18 లక్షల రూపాయలు, 4437 లీటర్ల మద్యం విలువ రూ. 69 లక్షలతో పాటు బంగారం, ఇతర వస్తువుల విలువ రూ. 23.32 లక్షలు స్వాధీనం చేసుకోవడం జరిగిందని నేటి వరకు వాటి విలువ రూ. 177.62 లక్షలు ఉంటుందని తెలిపారు. పట్టుబడిన నగదు, బంగారం అలాగే ఇతర వస్తువులు సంబంధిత బాధితులు ఆధారాలు అందచేస్తే పరిశీలన తదుపరి అందచేస్తామని , మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ను జిల్లాలో పకడ్బందీగా అమలు చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.