నవతెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్, కమ్మర్ పల్లి, కొన సముందర్, కోనాపూర్ గ్రామాల్లో ఎరువుల విక్రయ కేంద్రాలను బుధవారం అధికారులు తనిఖీలు చేశారు.జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్, భీంగల్ ఏడిఏ మల్లయ్యతో కలిసి ఎరువుల విక్రయ కేంద్రాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆయా ఎరువుల విక్రయ కేంద్రాల్లో రికార్డులను పరిశీలించారు.ఈ పాస్ మిషన్ లో వున్న ఎరువుల బస్తాల నిల్వలను, భౌతికంగా ఉన్న నిల్వలను ఆన్లైన్ వెరిఫికేషన్ చేశారు. ఎరువుల బస్తాలను ఈ పాస్ మిషన్ ద్వారా మాత్రమే రైతులకు విక్రయించాలని, అలా కాకుండా నేరుగా రైతులకు ఇచ్చినటైతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఎరువుల దుకాణాల యజమానులను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి వాజిద్ హుస్సేన్ మాట్లాడుతూ రైతులు కూడా ఎరువులు కొనేటప్పుడు తప్పనిసరిగా బిల్లులు తీసుకోవాలన్నారు. బిల్లులు ఇవ్వకుండా విక్రయాలు కొనసాగిస్తే మండల స్థాయి వ్యవసాయ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయాలన్నారు. అలాంటి షాపులపై చర్యలకు ఆస్కారం ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారిని బద్దం లావణ్య, వ్యవసాయ విస్తీర్ణ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.