పలు హోటల్లో మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తనిఖీలు

నవతెలంగాణ కంటేశ్వర్ : నిజామాబాద్ నగరంలోని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు పలు హోటళ్లను శనివారం తనిఖీలు చేశారు. నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ లో ఒకరోజు ముందు సంబంధించిన మాంసంతో కస్టమర్లకు వండి విక్రయిస్తున్నారు. ఈ విషయం మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల తనిఖీలలో బయటపడ్డాయి. ఈ మేరకు శనివారం నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ రాజేంద్ర కుమార్, రెవెన్యూ ఆఫీసర్ నరేందర్, సానిటరీ ఇన్స్పెక్టర్ నరేంద్ర ఆధ్వర్యంలో నగరంలో ప్రాపర్టీ టాక్స్, ట్రేడ్ లైసెన్స్ లు, పరిసరాల పరిశుభ్రత పై తనిఖీలు నిర్వహించారు. తనిఖీలలో భాగంగా నగరంలోని నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ లో తనిఖీలు నిర్వహించారు. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో శనివారం పశువదశాల కు సెలవు, కానీ త్రీ స్టార్ హోటల్ లో శుక్రవారం స్లాటర్ హౌస్ లో వధించిన మేకల మాంసాన్ని ఫ్రిడ్జ్ లో నిలవ ఉంచి శనివారం వాటితో మాంసం పదార్థాలను వండి హోటల్ కు వచ్చే కస్టమర్లకు వార్చుతూన్నారని గుర్తించారు. ఈ మేరకు నిఖిల్ సాయి ఇంటర్నేషనల్ హోటల్ కు రూ.15 వేల జరిమానా విధించారు. అదేవిధంగా బిర్యానీ దర్బార్ హోటల్ లో కాలం చెల్లిన ఆహార పదార్థాలను గుర్తించి ఆ హోటల్ కు పదివేల జరిమానా విధించారు. అదేవిధంగా హాట్ చిప్స్ అమ్మే దుకాణం లో ప్లాస్టిక్ కవర్లను గుర్తించి మూడు వేల రూపాయల జరిమానా విధించారు.