విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ చెప్పిన ఇన్ స్పెక్టర్ శ్రీనివాసచారి.. 

నవతెలంగాణ – సుల్తాన్ బజార్ 
నేటి నుండి మొదలైన  10 వ తరగతి వార్షిక పరీక్షలు రాస్తున్న విద్యార్థులందరికి సుల్తాన్ బజార్  ఇన్ స్పెక్టర్  శ్రీనివాసచారి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ.. సుల్తాన్ బజార్ పోలీస్ స్టేషన్ పరిధిలో 10 వ తరగతి వార్షిక పరీక్షలు జరుగుతున్న పరీక్ష కేంద్రాల దగ్గర పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు. పరీక్ష కేంద్రాల దగ్గర ఎవ్వరు గుంపులు గుంపులుగా గుమికుడి ఉండవద్దు. పరీక్ష కేంద్రాల లోపలికి సెల్ ఫోన్ తీసుకోని వెళ్ళడానికి ఎవరికీ అనుమతి లేదు అన్నారు. పరీక్ష కేంద్రాల పరిసర ప్రాంతాలలో ఉన్న జిరాక్స్ కేంద్రాలు పరీక్ష సమయం లో మూసివేసుకోవాలి సూచించారు. ఎవరైనా పరీక్ష కేంద్రాల దగ్గర చట్ట వ్యతిరేకమైన పనులు చేస్తే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతమైన వాతావరణం లో పరీక్షలు రాయాలని, ఎలాంటి భయందోలనలకు లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాసుకోవాలన్నారు. విద్యార్థులందరు సమయపాలన పాటిస్తూ ఒక గంట ముందుగానే పరీక్ష కేంద్రాన్ని చేరుకోవాలన్నారు. ఎక్కడ ఎవరికైనా ట్రాఫిక్ ఇబ్బందులు కల్గితే డయల్ 100 కి కాల్ చేసి పోలీస్ అధికారులకు తెలియజేయాల తెలిపారు.