కొనుగోలు కేంద్రాలను పరిశీలించిన ఇన్స్పెక్టర్

Inspector who inspected the buying centersనవతెలంగాణ – బొమ్మలరామారం
ధాన్యం కొనుగోలు  కేంద్రాలను యాదాద్రి భువనగిరి జిల్లా తూనికల కొలతల ఇన్స్పెక్టర్ కందగట్ల  వెంకటేశ్వర్లు ఆకస్మికంగా శనివారం మండలంలోని నాగినేనిపల్లి, హాజీపూర్,మల్యాల,గ్రామాలలో ఉన్న వడ్ల కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. వడ్ల  కొనుగోలు సకాలంలో చేయాలని వేయింగ్ మిషన్లు తూనికల కొలతల ఆఫీసర్ సర్టిఫై చేసిన వాటిపైనే తూకం  చేయాలని, తూకం విషయంలో రైతులను ఇబ్బంది పెడితే  కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైస్ మిల్లర్ యజమానులు తరుగు విషయంలో ఇబ్బందులు పెడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం మండలంలోని రైస్ మిల్లులను తనిఖీ చేశారు. చీకటిమామిడిలో ఉన్న తిరుమలనాధ వే బ్రిడ్జి ను పరిశీలించారు. పిఎసిఎస్ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించి సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆయా గ్రామాల అధికారులు పాల్గొన్నారు.