రాజా రవీంద్ర ప్రధాన పాత్రలో సాయిజా క్రియేషన్స్ పతాకం పై చల్లపల్లి చలపతిరావు దివ్య ఆశీస్సులతో ఉమాదేవి, శరత్ చంద్ర నిర్మాతలుగా పద్మారావు అబ్బిశెట్టి (అలియాస్ పండు) దర్శకుడిగా పరిచయం అవుతున్న చిత్రం ‘సారంగదరియా’. ఎం.ఎబెనెజర్ పాల్ సంగీత సారథ్యం వహిస్తోన్న ఈ సినిమా నుంచి శుక్రవారం మేకర్స్ ‘అందుకోవా…’ అనే లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. హీరో నవీన్ చంద్ర చేతుల మీదుగా పాట విడుదలైంది. సాంగ్‌ను విడుదల చేసిన ఆయన చిత్ర యూనిట్‌కు అభినందనలు తెలిపారు. ఈ పాటను లెజెండ్రీ సింగర్ కె.ఎస్.చిత్ర ఆలపించారు. ఇదొక ఇన్‌స్పిరేషనల్ సాంగ్. రాంబాబు గోశాల పాటను రాశారు.
ఈ సందర్భంగా నిర్మాతలు ఉమాదేవి, శరత్ చంద్ర చల్లపల్లి మాట్లాడుతూ, ‘చిత్రగారు మా పాటను పాడటం మాకెంతో సంతోషంగా ఉంది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. త్వరలోనే రిలీజ్ డేట్‌ను అనౌన్స్ చేస్తాం’ అని అన్నారు. ‘ఒక మధ్యతరగతి ఫ్యామిలీలో జరిగిన కొన్ని ఘర్షణలతో కథ ఉంటుంది. చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్. లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ ఇలా అన్ని ఎలిమెంట్స్ ఉంటాయి’ అని డైరెక్టర్ పద్మారావు అబ్బిశెట్టి (పండు) చెప్పారు.