అయ్యప్ప ఆలయంలో ధ్వజస్తంభ ప్రతిష్టాపన

నవ తెలంగాణ – కమ్మర్ పల్లి
మండలంలోని ఉప్లూర్ గ్రామంలో ఋషికొండ అయ్యప్ప క్షేత్రంలో ఆదివారం ఏకశిల ధ్వజస్తంభ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజ కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం ధ్వజ స్తంభానికి పూజలు నిర్వహించి, భక్తిశ్రద్ధలతో ఏకశిల  ధ్వజస్తంభాన్ని ప్రతిష్టించారు. ఈ సందర్భంగా మేడారం భూమన్న  గురుస్వామి  మాట్లాడుతూ సోమవారం మకర సంక్రాంతి సందర్భంగా సాయంత్రం 4గంటల నుండి 6గంటల వరకు ఋషికొండ అయ్యప్ప క్షేత్రంలో హిందూ ధర్మం ఆస్థాన పండితులు కొడకొండ్ల శ్రీరామ శరణ్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి పల్లకి సేవ, పుష్పాభిషేకం, నెయ్యాభిషేకం కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు.అనంతరం 6గంటల 30 నిమిషాలకు మహా మంగళహారతి,  అఖండ జ్యోతి దివ్య దర్శనం ఉంటుందని తెలిపారు.  ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని స్వామి వారి దివ్య ఆశీస్సులు పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు రాజ్ వీర్, బద్ధం తిరుపతిరెడ్డి, భోగ శ్యామ్, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.