ఎంపీల్యాడ్ నిధులతో లొంగన్ బసవేశ్వర్ విగ్రహం వద్ద హైమాస్ లైట్ ఏర్పాటు

నవతెలంగాణ – జుక్కల్

మండలంలోని లొంగన్ గ్రామములో జహిరాబాద్ ఎంపి బిబి పాటీల్ ఎంపిల్యాడ్ నిధులతో  బసవేశ్వర్ విగ్రహం కూడలి వద్ద హైమాస్ లైట్ ఏర్పాటు చేసి బుదువారం నాడు స్థానిక వీరశైవ లింగాయత్ నాయకులు నాగలగిద్దే సదుపటేల్, ఖౌరే ప్రకాష్, రామ్ నాథ్ తో కలిసి ప్రారంబించడం జరిగింది. ఈ సంధర్భంగా లింగాయత్ సమాజ్ నాయకులు సదుపటేల్ మాట్లాడుతు 1లక్ష  ఎంపి25వేల రూపాయల వ్యయంతో  ఎంపి  ల్యాడ్ నిధులు మంజూరైనాయని పేర్కోన్నారు. హైమాస్ లైట్ ఏర్పాటుతో గ్రామములో వెలుగులు నింపినాయని , రాత్రీ పూట గ్రామములో వెలుతురుతో వాడలన్ని కన్పిస్తున్నాయని, చీకటీ అనే సమస్య ఉండదని వారు తెలిపారు. కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మాజీ సర్పంచ్ నాగలగిద్దే ఉషారాణీ తదితరులు పాల్గోన్నారు.