భీంగల్ మున్సిపాలిటీ పట్టణంలోని బోర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ (బోధిరే గల్లీ) ఆధ్వర్యంలో గణనాథుని విగ్రహ ప్రతిష్టడం జరిగింది. యూత్ సభ్యులు మాట్లాడుతూ: గత సంవత్సరాల నుండి మూడు గైండ్ల సంఘాల ఆధ్వర్యంలో బోర్ర హనుమాన్ మందిరం లో గణనాథుని విగ్రహ ప్రతిష్టాపన చేస్తూ ఆనవాతిగా జరిగింది. తదనంతరం బోర్ర హనుమాన్ యూత్ అసోసియేషన్ (బోదిరిగల్లి) ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బోర్ర హనుమాన్ మందిరంలో గణనాథుని విగ్రహాన్ని ప్రతిష్టాపిస్తూ రావడం జరుగుతుందని తెలిపారు. గణనాథుని ఆశీస్సులతో తెలంగాణ రాష్ట్రం ప్రకృతి వైపరీత్యాలు కరువు కాటకాలు లేకుండా సుభిక్షంగా ఉండాలని గణనాథుని వేడుకుంటున్నామని యూత్ సభ్యులు తెలిపారు. పురానిపేట్ రోడ్ రైస్ మిల్ నుండి గణనాథుని డప్పు చప్పులతో ,భజనలతో, డీజే పాటలతో, డాన్సులతో ఊరేగింపుగా తీసుకురావడం జరిగిందని ప్రతిరోజు నిత్యాన్నదానం జరుపుతామని తెలిపారు .ఈ కార్యక్రమంలో మూడు గైండ్ల సంఘాలు, యూత్ సభ్యులందరూ పెద్ద ఎత్తున పాల్గొన్నారు.