2024 ఆర్థిక సంవత్సరంలో ఇన్సూరెన్స్ సన్నద్ధత

  • మీ జేబుపై చిల్లు పడకుండానే ఆర్థిక స్థితి మెరుగుపడేలా చూసుకోవడం
  • విశాల్ గుప్తా, CEO, PhonePe ఇన్సూరెన్స్ బ్రోకింగ్ సర్వీసెస్

నవతెలంగాణ-హైదరాబాద్ : సంపద కూడబెట్టాలని మనందరం అనుకుంటాం. ఈ ప్రాసెస్‌లో క్రమశిక్షణ కీలకమైన అంశం. ఒక క్రమ పద్ధతిలో దీర్ఘకాలం పాటు మదుపు చేయడమే క్రమశిక్షణ. ఇందులో ముఖ్యమైన అంశం ఏమిటంటే మన పెట్టుబడులకు ఢోకా లేకుండా చూసుకోవడం. ఒక్కోసారి అనుకోని సంఘటనలు ఎదురవుతాయి. అలా జరిగినప్పుడు ఆ నిర్దిష్ట నెలలో మదుపు చేయడం సాధ్యం కాకపోవచ్చు. అంతే కాకుండా అనుకోని ఆర్థిక ఇబ్బందులను తట్టుకోవడానికి ఇప్పటికే చేసిన మదుపు సొమ్ము నుంచి కొంత మొత్తం వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇలాంటి కఠినమైన పరిస్థితి ఏర్పడినప్పుడు మన మదుపు ప్లాన్‌కు ఆటంకం రాకుండా చూసుకోవడం అన్నది చాలా కీలకమైన అంశం. అందువల్ల మనం ఇన్సూరెన్స్‌ను కేవలం రక్షణ ఇచ్చే కవచంలా మాత్రమే కాకుండా మొత్తం పెట్టుబడి వ్యూహంలో ఒక భాగంగా చూడాలి. ఇన్సూరెన్స్‌ను ఒక “ఖర్చు”గా కాకుండా వ్యూహాత్మక పెట్టుబడిగా చూడాలి. అలా చూస్తే అత్యవసర పరిస్థితులు తలెత్తినప్పుడు, అనూహ్య సంఘటనలు జరిగినప్పుడు, హాస్పిటల్ ఖర్చులు పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు మనం దాచుకున్న డబ్బునంతా ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇన్సూరెన్స్ మనల్ని ఆదుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఒక సమ్రగమైన ఆర్థిక ప్రణాళిక ఉండాలి. ఆ ప్రణాళికను అమలు చేస్తూ మనం సన్నద్ధంగా ఉండటం ముఖ్యం. ఏదైనా అనూహ్య సంఘటనను ఎదుర్కోవడానికి మనం సిద్ధంగా ఉన్నప్పుడు, సంపద కూడబెట్టడం, ఇన్సూరెన్స్ తీసుకోవడం అనే రెండు లక్ష్యాలు చక్కగా ముందుకెళతాయి. దేన్నీ త్యాగం చేయాల్సిన అవసరం ఉండదు. హెల్త్ ఇన్సూరెన్స్‌, లైఫ్ ఇన్సూరెన్స్‌ తీసుకున్నప్పుడు సెక్షన్‌ 80D, 80C కింద పన్ను ప్రయోజనాలు కూడా లభిస్తాయి.
ఒక ఉదాహరణ చూద్దాం. అనుకోకుండా వచ్చే ఆర్థిక ఇబ్బందుల నుంచి రక్షణ కల్పించడంలో, రిస్క్‌ను తగ్గించడంలో ఇన్సూరెన్స్‌కు ఎంత ముఖ్యమైన పాత్ర ఉంది అనే ప్రశ్నకు, ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా సంక్షోభాన్ని సృష్టించిన కొవిడ్-19 మహమ్మారిని ఒక సాక్ష్యంగా చెప్పవచ్చు. ఈ కొవిడ్ గడ్డు కాలంలో చాలా మంది ఇబ్బంది పడ్డారు. భారంగా మారిన మెడికల్ ఖర్చులను తట్టుకోవడానికి దాచుకున్న సొమ్మునంతా ఖర్చు పెట్టాల్సి వచ్చింది. ఫలితంగా వారి ఆర్థిక లక్ష్యాలు అస్తవ్యవస్తంగా మారాయి. అయితే హెల్త్ ఇన్సూరెన్స్, లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న వారు మాత్రం ఈ క్లిష్ట పరిస్థితులను తట్టుకుని నిలబడ్డారు. డబ్బును సమర్థంగా పొదుపు చేయడంలో భారతీయులకు సహాయపడటానికి PhonePe కట్టుబడి ఉంది. ఈ నేపథ్యంలో మదుపు ప్లానింగ్‌లో ఇన్సూరెన్స్ పోషించే పాత్రను లోతుగా అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. అందునా మనం కొత్త సంవత్సరం 2024కు చేరువవుతున్న వేళ దీని గురించి తెలుసుకోవాలి.
FY 2024లో రక్షణ కవచం కోసం సరైన విధంగా సన్నద్ధం కావడం మీకు తెలుసా?
ఇండియాలో ప్రస్తుతం ప్రజలు ఇల్లు, పొలం, బంగారం లాంటి భౌతిక ఆస్తులు, అలాగే బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్ల వంటి సంప్రదాయ పెట్టుబడుల నుండి మ్యూచువల్ ఫండ్స్, షేర్లు లాంటి ఫైనాన్షియల్‌ ఆస్తుల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ గుణాత్మకమైన మార్పును CRISIL మార్కెట్ ఇంటెలిజెన్స్ & అనలిటిక్స్ నివేదిక వివరిస్తోంది. ఆసక్తికర విషయం ఏంటంటే, మారిన ఈ ధోరణి, స్టాక్ మార్కెట్ విషయంలో స్పష్టంగా కనిపిస్తోంది. నేషనల్ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ (NSE) వద్ద డీమ్యాట్ ఖాతాల సంఖ్య 2023 ఆగస్ట్ నాటికి 12.7 కోట్ల చేరుకుంది. కిందటి సంవత్సరంతో పోలిస్తే 26 శాతం పెరుగుదల నమోదైంది.
ప్రజల ఆర్థిక లక్ష్యాల్లో స్పష్టమైన మార్పు కనిపిస్తున్నప్పటికీ, చాలా మంది ఇన్సూరెన్స్‌కు ఇవ్వాల్సినంత ప్రాధాన్యం ఇవ్వడం లేదు. పూర్తి పెట్టుబడి వ్యూహంలో ఇన్సూరెన్స్‌ ఒక ముఖ్యమైన భాగం అనే విషయాన్ని గుర్తించడం లేదు. ఆర్థికంగా రక్షణ పొందడంలో ఇన్సూరెన్స్‌కు ఉన్న ప్రాధాన్యం గురించి అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది.
తగినంతగా కవరేజీ పొందడం కోసం హెల్త్ ఇన్సూరెన్స్‌ను కస్టమైజ్ చేసుకోవడం
ఒక ఉదాహరణ చూద్దాం – పంజాబ్‌కు చెందిన రామ్ ఓ మధ్య తరగతి కుటుంబానికి చెందిన వృత్తి నిపుణుడు. ఏదో ఒక రోజు తనకంటూ సొంత ఇల్లు ఉండాలని కల గంటున్నాడు. ఇందుకోసం డౌన్‌ పేమెంట్‌ను సిద్ధం చేసుకోవడానికి ఒక క్రమ పద్ధతిలో డబ్బును పోగు చేస్తూ వస్తున్నాడు. ఇలా పొదుపు చేసే సమయంలో అనూహ్యంగా మెడికల్ ఖర్చుల కోసం రూ.5 – 10 లక్షలు వెచ్చించాల్సి వస్తే ఏంటి పరిస్థితి? ఇలాంటి ఆకస్మిక ఖర్చు కారణంగా సొంతింటి డౌన్‌ పేమెంట్‌కు అతను పొదుపు చేయాల్సిన సమయం బాగా పెరుగుతుంది. కనీసం 3 నుంచి 5 సంవత్సరాలు అదనంగా సేవ్‌ చేయాల్సి ఉంటుంది. అదే రామ్‌కు రూ.10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఉండి, ఇందుకోసం నెలకు సుమారు రూ.700* లేదా ఏడాదికి రూ.8000* ప్రీమియం చెల్లించాడని అనుకుందాం. అప్పుడు ఆకస్మికంగా వచ్చే మెడికల్‌ ఖర్చులు అతనికి సమస్యను సృష్టించవు. ఆర్థిక సమస్యల్లో పడకుండా సొంతింటి కలను నెరవేర్చుకునే ప్రయత్నాన్ని నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు.
* ఇక్కడ పేర్కొన్న నెంబర్లు కేవలం అంచనాలు మాత్రమే, అవి వాస్తవంగా అయ్యే ఖర్చులను ప్రతిబింబించవు. ఆరోగ్యం, వయసు, పెట్టుబడి కమిట్‌మెంట్లు అనే అంశాల ఆధారంగా తగినంత హెల్త్ ఇన్సూరెన్స్‌ ఉండేలా చూసుకోండి. అలాగే పెరుగుతూ వస్తున్న వైద్యపరమైన ఖర్చులను (మెడికల్ ఇన్‌ఫ్లేషన్‌ను) కూడా దృష్టిలో పెట్టుకోవడం చాలా ముఖ్యం. ఇప్పుడు ఉన్న మెడికల్‌ ఖర్చులు, భవిష్యత్తులో వాటిలో వచ్చే పెరుగుదలకు అనుగుణంగా హెల్త్ ఇన్సూరెన్స్‌ తీసుకోవాలి. ఇది గరిష్ఠంగా రూ.50 లక్షలు లేదా అంతకంటే ఎక్కువగా తీసుకునే అంశాన్ని కూడా పరిశీలించవచ్చు. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, కవరేజీ మొత్తం 5 రెట్లు పెరిగినప్పటికీ, చెల్లించాల్సిన ప్రీమియం మొత్తం కేవలం 2 రెట్లు మాత్రమే పెరుగుతుంది. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఏదైనా మెడికల్ ఖర్చు మీద పడినప్పుడు మీ ఇతర పెట్టుబడులు, సంపద సృష్టి (వెల్త్‌ క్రియేషన్‌) లక్ష్యాలు దెబ్బతినకుండా ఉండాలి. ఇందుకోసం మీ జీవన శైలికి అనుగుణంగా తగినంత హెల్త్ ఇన్సూరెన్స్‌ను తీసుకోండి. అనుకోకుండా కలిగే నష్టం వల్ల తలెత్తే ఆర్థిక కష్టాల నుంచి రక్షణ కోసం లైఫ్ ఇన్సూరెన్స్‌ తీసుకోవడం ఈ ఉదాహరణ చూడండి – తమిళనాడుకు చెందిన శ్రీనివాస్ సొంతింటి కోసం 15-ఏళ్ల EMI ప్లాన్‌తో ₹60 లక్షల పెట్టుబడి పెట్టాడు. ఆరేళ్ల పాటు క్రమం తప్పకుండా EMI చెల్లించాడు. అయితే అతను అకాల మరణం చెందడంతో అతని కుటుంబం ఆర్థిక సంక్షోభంలో పడింది. మిగిలిన 9 ఏళ్ల పాటు EMI ఎలా చెల్లించాలో అర్థం కాని పరిస్థితిలోకి వెళ్లింది. ఆర్థిక సంసిద్ధత లేకపోవడం అన్న పాయింట్‌ ఈ కుటంబాన్ని కష్టాల సుడి గుండంలోకి నెట్టేసింది. అటు కుటుంబ పెద్దను పోగొట్టుకోవడంతో పాటు ఇటు EMI చెల్లించలేక ఇంటిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితి ఎంత బాధ కలిగించేది అయినప్పటికీ, టర్మ్ ఇన్సూరెన్స్ కవరేజీ పోషించే కీలకమైన పాత్రను స్పష్టంగా తెలియజేస్తోంది. ఇలాంటి కవరేజీ ఉంటే అనూహ్యంగా తలెత్తే కష్టాల వల్ల ఏర్పడే ఆర్థిక సంక్షోభాన్ని తట్టుకోవచ్చు. ఎంతో ఇష్టపడి కొనుక్కున్న ఆస్తులను కాపాడుకోవడానికి అవకాశం ఉంటుంది. టర్మ్ ప్లాన్‌లు చాలా ఉపయోగకరమైనవి. ఇక మీరు లేరని తెలిసినప్పుడు మీ కుటుంబం భద్రంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి. సాధారణంగా మీ ప్రస్తుత వార్షిక సంపాదనకు 15 నుండి 20 రెట్లు ఎక్కువగా కవరేజీ ఉండేలా టర్మ్‌ ప్లాన్‌ తీసుకోవాలని సిఫార్సు చేస్తుంటారు. లేదంటే తక్కువలో తక్కువగా మీకు ఉన్న లోన్‌లను, అప్పులను, ఇతర ఖర్చులను కవర్ చేసేందుకు సరిపడా కవరేజీని తీసుకోవాలి. మీరు వచ్చే 12 నెలల్లో టర్మ్ ప్లాన్ తీసుకుంటున్నా లేదా ఇప్పటికే ఉన్న కవరేజీకి కొంత మొత్తాన్ని జోడిస్తున్నా, మీ కుటుంబ ప్రస్తుత జీవనశైలికి అనుగుణంగా, అనూహ్య పరిస్థితుల్లో వారిపై ఆర్థిక భారం పడితే దాన్నుంచి రక్షణ ఉండేలా కవరేజీని ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.

ఇండియాలో ఇన్సూరెన్స్ రంగం వృద్ధి: డిజిటల్ మార్పును ఆకళింపు చేసుకోవడమే భవిష్యత్తు
గతంలో సరైన సమాచారం లేకపోవడం, ఇతర డాక్యుమెంటేషన్ సమస్యల కారణంగా ఇన్సూరెన్స్ పాలసీని కొనుగోలు చేయడం అనేది చాలా సంక్లిష్టంగా ఉండేది. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ & డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) వారు ఈ రంగంలో చాలా మార్పులు తీసుకువస్తున్నారు. ‘2047 నాటికి అందరికీ ఇన్సూరెన్స్’ అనే లక్ష్యాన్ని చేరుకోవడంలో భాగంగా ఇన్సూరెన్స్ ఉత్పత్తులు అందరికీ చేరువ కావడానికి గట్టి కృషి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇన్సూరెన్స్ ఉత్పత్తులు సులభంగా అర్థమయ్యేలా, సులభంగా కొనుగోలు చేసేలా, అన్నిటి కన్నా ముఖ్యంగా వ్యక్తుల అవసరాలకు తగినట్లుగా ఉండేలా రూపొందించాల్సిన అవసరం ఉంది.