న్యూఢిల్లీ: ప్రముఖ ఎఫ్‌ఎంసిజి కంపెనీ ఇంటెగ్రా ఎస్సెన్సియా 2024-25 జూన్‌తో ముగిసిన తొలి త్రైమాసికం (క్యూ1)లో 107.63 శాతం వృద్థితో రూ.2.45 కోట్ల నికర లాభాలు సాధించినట్లు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో రూ.1.18 కోట్ల లాభాలు ఆర్జించింది. ఇదే సమయంలో రూ.68.1 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం.. గడిచిన క్యూ1లో రూ.40 శాతం పెరిగి రూ.100.6 కోట్లకు చేరింది. ఇటీవల బ్రెవ్‌టుస్ బేవరేజిస్ ప్రయివేటు లిమిటెడ్ (బిబిపిఎల్)ను స్వాధీనం చేసుకున్న సంస్థలో రూ.10 కోట్ల పెట్టుబడుల వ్యయం చేయనున్నట్లు పేర్కొంది.