‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తర్వాత అనుష్క నటిస్తున్న తాజా చిత్రం ‘ఘాటి’. క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహిస్తున్నారు. ‘వేదం’ తర్వాత అనుష్క, క్రిష్ కాంబినేషన్‌లో రాబోతున్న రెండవ సినిమా ఇది. ఈ సినిమా షూటింగ్ ఇంకో మూడు రోజుల్లో పూర్తవుతుంది. యాదృచ్ఛికంగా షూటింగ్ పూర్తయ్యే రోజే అనుష్క బర్త్‌డే కావడం విశేషం. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మేకర్స్ రెండు ముఖ్యమైన అప్‌డేట్‌లను అనౌన్స్ చేశారు. మూవీ ఫస్ట్ లుక్, ఏ స్పెషల్ గ్లింప్స్ ఇన్ టు ది వరల్డ్‌ని రిలీజ్ చేస్తున్నారు. టైటిల్ పోస్టర్‌లో ట్రెక్కర్లు ఘాట్‌లను నావిగేట్ చేసే బ్రీత్ టేకింగ్ సీన్ అందరిలోనూ ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ చిత్రంలో నటించే నటీనటులు, పనిచేసే సాంకేతిక నిపుణుల వివరాలను కూడా అనుష్క బర్త్‌డే రోజు వెల్లడించనున్నారు. యువీ క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నాయి.