ఉత్తర కాశీలో సహాయక చర్యలు ముమ్మరం చేయండి

Relief operations in North Kashi Intensify– సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో విజ్ఞప్తి
న్యూఢిల్లీ: ఉత్తరకాశీలో నిర్మాణంలో వున్న సొరంగం కుప్పకూలి చిక్కుకుపోయిన 41మంది కార్మికుల దుస్థితి పట్ల సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. ఈ సంఘటన జరిగి వారం రోజులు గడిచిపోయిందని, ఇప్పటివరకు వారిని కాపాడేందుకు చేస్తున్న ప్రయత్నాలు విజయవంతం కాలేదని పేర్కొంది. కార్మికులను కాపాడేందుకు చేపట్టే సహాయక చర్యల కోసం అంతర్జాతీయ నిపుణులు, సంస్థల సాయం కేంద్ర ప్రభుత్వం ఎందుకు కోరడం లేదో అర్థం కావడం లేదని పొలిట్‌బ్యూరో పేర్కొంది. చిక్కుకుపోయిన కార్మికులను వెలికితీసేందుకు తాజా సాంకేతికతలను, నైపుణ్యాలను ఉపయోగించడానికి గల అన్ని ప్రయత్నాలు చేయాలని, వేటినీ మినహాయించరాదని పేర్కొంది.