నవతెలంగాణ – అశ్వారావుపేట
తెలంగాణ రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల దృష్ట్యా ఎన్నికల నియమావళి ప్రకారం అంతరాష్ట్ర, అంతర్ జిల్లా చెక్ పోస్టులను ఏర్పాటు చేసి తనిఖీలను చేపట్టడం జరుగుతుందని జిల్లా ఎస్పీ డా. వినీత్.జి ఐపిఎస్ వెల్లడించారు. నగదు,మద్యం,మాదకద్రవ్యాల అక్రమ రవాణాను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు.ప్రశాంత వాతావరణంలో ఎన్నికలను నిర్వహించేందుకు జిల్లాలో అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను చేసినట్లు తెలిపారు.జిల్లాలో 12 అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టులను,10 అంతర్ జిల్లా సరిహద్దు చెక్ పోస్టులను ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేసారు.పది రోజులలో చేపట్టిన తనిఖీల లో జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు రూ. 1 కోటి 24 లక్షల 55 వేలు 8 వందలు నగదును, రూ.25 లక్షల విలువ గల గంజాయి,రూ.1 లక్షా 77 వేల 9 వందల విలువ గల అక్రమ బెల్లం ను స్వాదీనం చేసుకోవడం జరిగిందని వివరించారు. బుధవారం జిల్లా వ్యాప్తంగా జులూర్ పాడు, భద్రాచలం, బూర్గంపాడు, అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన సరిహద్దు చెక్ పోస్టులను సందర్శించి అక్కడ విధులలో ఉన్న అధికారులు,సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఆయన వెంట పాల్వంచ డిఎస్పీ వెంకటేష్, అశ్వారావుపేట సి.ఐ కరుణా కర్, ఎస్.హెచ్.ఒ 1 ఎస్.ఐ శ్రీకాంత్ ఉన్నారు.