నవతెలంగాణ – గోవిందరావుపేట
నార్కోటిక్ స్నైపర్ డాగ్ తో మత్తు పదార్థాల గుర్తింపుకై విస్తృత తనిఖీలు నిర్వహించినట్లు పసర పోలీస్ స్టేషన్ ఎస్ ఐ ఏ కమలాకర్ తెలిపారు. మంగళవారం మండల వ్యాప్తంగా జిల్లా ఎస్పీ శబరిస్ ఐపీఎస్ మరియు సిఐ. జి రవీందర్ సూచనల మేరకు పలు గ్రామాలలో మరియు జాతీయ రహదారి వెంట వాహనాలలో మత్తు పదార్థాలను తరలిస్తున్నారని సిబ్బందితో కలిసి నార్కోటిక్ స్నైపర్ డాగ్ తో తనిఖీలు నిర్వహించడం జరిగిందన్నారు. స్నైపర్ డాగ్స్ డ్రగ్స్ నీ పేలుడు పదార్థాలను పసిగడతాయనీ,ప్రతి రోజూ విస్తృతంగా తనిఖీలు చేపడుతాం అన్నారు. యువత మత్తుకు బానిస కావద్దు డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే పోలీసుల లక్ష్యం.చట్ట వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు.పోలీస్ సిబ్బంది ప్రత్యేక శిక్షణ పొందిన స్నైపర్ డాగ్ తో బస్టాండు , చౌరస్తా, కిరాణం షాప్, పరిసర ప్రాంతాలలో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు. ప్రత్యేక శిక్షణ పొందిన స్నైపర్ డాగ్ హత్యలు దోపిడీల చిక్కుముడులను విప్పడానికి గంజాయి డ్రగ్స్ ను, పేలుడు పదార్థాలను పసిగట్టి పట్టించడం జరుగుతుందన్నారు . ఇవి మామూలు డాగ్స్ కాదు. పోలీసుల అవసరాలకు తగ్గట్టు వీటిని ఉపయోగించడం జరుగుతుందన్నారు. నిత్యం ప్రతిరోజు మండలంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టడం జరుగుతుందన్నారు. డ్రగ్స్ రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే ఎస్పీ గారి ముఖ్య ఉద్దేశమని . డ్రగ్స్ ను నిర్మూలించడం లక్ష్యంగా పోలీసుల ముఖ్య లక్ష్యం అన్నారు. గ్రామీణ ప్రాంత యువత ముత్తు పదార్థాలకు బానిసై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని యువతకు సూచించారు. గంజాయి లాంటి మత్తు పదార్థాలు సరఫరా చేస్తున్న వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీసులకు తెలుపాలని. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు.