నియోజకవర్గ కేంద్రమైన ముధోల్లోని వివిధ వార్డుల్లో పారిశుద్ధ్య పనులను ముమ్మరంగా చేపట్టారు. మురికి కాలువలను శుభ్రం చేసి ఎప్పటికప్పుడు తీసిన మట్టిని తొలగించే పనులను పంచాయతీ కార్మికులు చెప్పట్టారు. ఈ సందర్భంగా ఈవో ప్రసాద్ గౌడ్ సోమవారం పరీశీలించారు. ఆనంతరం మాట్లాడారు. ప్రజలు తమ వంతు బాధ్యతగా గ్రామపంచాయతీ సిబ్బందికి సహకరించాలని కోరారు. చెత్తను మురుగు కాలువల్లో వేయకుండా చెత్త బండి లోనే వేయాలన్నారు. ప్రజల సహకారంతో పారిశుద్ధ్య పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని అన్నారు. ఇప్పటికే వార్డుల వారీగా మురుగు కాలువలను శుభ్రం చేసే పనులు చేపట్టడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో పారిశు ద్ధ్య పనులు చేపట్టడం జరుగుతుందన్నారు.