
మండలంలోని అన్ని ప్రాథమిక ప్రభుత్వ పాఠశాలలో ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమం బుధవారం ముమ్మరంగా ప్రారంభించారు.ఈ సందర్భంగా మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం పెండింగ్ డిఏ లను విడుదల చేయాలని,దసరా కానుకగా పిఆర్సీ నీ ప్రకటించాలని, 317 జీవో బాధితుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పాఠశాలలో పారిశుద్ధ్య కార్మికుల నియామకానికి స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయుల సమస్యలన్నింటినీ పరిష్కరించి” ప్రజా ప్రభుత్వం” అనే పేరు నిలబెట్టుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో టిఆర్ టిఏప్ జిల్లా అధ్యక్షుడు పెoడెం మధుసూదన్, జిల్లా ప్రధాన కార్యదర్శి కూచనపల్లి రవీందర్, రాష్ట్ర కార్యదర్శి నలుమాసుల రఘుకుమార్, రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ నామని శంకర్, మండల బాధ్యులు బోయినీ సతీష్,గొర్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.