నేటి నుండి ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు..

నవతెలంగాణ – భువనగిరి
ఈనెల 24 నుండి మూడో తేదీ వరకు ఇంటర్ అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు జరగనున్నాయి ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఇంటర్ మొదటి సంవత్సరం తిరిగి మధ్యాహ్నం రెండు గంటల 30 నిమిషాల నుండి సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాల వరకు ఇంటర్ రెండవ సంవత్సర పరీక్షలు నిర్వహించబడతాయి ప్రధమ ద్వితీయ సంవత్సరం 5684 మంది.  జిల్లాలో మొత్తం 16 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఇంటర్ ప్రథమ సంవత్సరం 3682 మంది, ఇంటర్ రెండవ సంవత్సరం 2297 మంది విద్యార్ధినీ విద్యార్థులు పరీక్షలు వ్రాస్తున్నారు.  పరీక్షల నిర్వహణకు సెంటర్ కు ఒకరు చొప్పున 16 మంది ఛీఫ్ సూపరింటెండెంట్లు, 16 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లు, ఫ్లయింగ్ స్క్వాడ్స్, సిట్టింగ్ స్క్వాడ్స్ నియమించడం జరిగింది, పరీక్షా కేంద్రాలలో అన్ని వసతులు, పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు  చెయ్యనున్నారు, పరీక్షా సమయంలో విద్యుత్ అంతరాయం లేకుండా ఏర్పాటు చేశారు, ఫస్ట్ ఎయిడ్ మందులు, ఎమర్జెన్సీ మందులు, ఓఆర్ఎస్ ప్యాకెట్స్తో సిద్దంగా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నారు. బస్సులో ఏర్పాటు మార్మూల ప్రాంతాల నుండి పరీక్షల నిమిత్తం వచ్చే విద్యార్థులకు పరీక్ష కేంద్రాలకు సకాలంలో తీసుకోవచ్చు పరీక్ష అనంతరం వారిని తిరిగి వెళ్లేలా బస్సులు ఏర్పాటు చేశారు పోస్టల్ శాఖ పరీక్ష జవాబు పత్రాలను ప్రోటోకాల్ ప్రకారం తరలించనున్నది.
కలెక్టర్ సమీక్ష.. ఇంటర్ సప్లమెంటరీ పరీక్షల పై జిల్లా కలెక్టర్ హనుమంతు కే జండగే ప్రత్యేక సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు. విద్య, వైద్య ఆరోగ్య, ఆర్టీసీ, రెవెన్యూ, పోలీస్, పోస్టల్ శాఖ అధికారులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు వారికి పలు సూచనలు చేశారు.  పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఏర్పాట్లను చేయాలని సూచించారు.
.