– ఫిబ్రవరి 1 నుండి ప్రాక్టికల్స్
– ఫిబ్రవరి 28 నుండి మార్చ్ 19 వరకు వార్షిక పరీక్షలు
నవతెలంగాణ – భువనగిరి
నవతెలంగాణ – భువనగిరి
ఇంటర్ ప్రథమ సంవత్సరం ద్వితీయ సంవత్సరం ఫిబ్రవరి 1 నుండి 15 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయని ఇంటర్మీడియట్ మోడల్ అధికారి సి రమణి తెలిపారు. మంగళవారం ఆమె నవతెలంగాణ తో మాట్లాడారు ఫిబ్రవరి 16 నుండి ఇంగ్లీష్ ప్రాక్టికల్స్ ఉంటాయన్నారు 17వ తేదీ ఎథిక్స్ మరియు మానవ విలువలు, 19న ప్రకృతి పర్యావరణం (ఎన్విరాన్మెంట్) పై పరీక్షలు నిర్వహిస్తామని తెలిపారు. ఫిబ్రవరి 28 నుండి 19 వరకు వార్షిక పరీక్షలు కొనసాగుతాయని తెలిపారు. ప్రాక్టికల్స్ కు 9 గంటల నుండి 12 గంటల వరకు, రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు జరుగుతాయని తెలిపారు. ఉత్తీర్ణశాతం పెరగడానికి కృషి చేయాలని అధ్యాపకులను కోరారు. విద్యార్థులు సమయపాలన పాటించాలని కోరారు.