ఇంటర్‌ డిస్ట్రిక్‌ ఫెన్సింగ్‌ టోర్నీ

Inter District Fencing Tournament– జనవరి 7న రాష్ట్ర జట్టు ఎంపిక
హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర 4వ సీనియర్‌ అంతర్‌ జిల్లాల ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్‌ జనవరి 7, 2024న జరుగనుంది. జనవరి 28 నుంచి గువహటి వేదికగా సీనియర్‌ నేషనల్‌ ఫెన్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌ జరుగనుండగా.. ఆ టోర్నీలో పాల్గొనే రాష్ట్ర జట్టును జనవరి 7న ఎంపిక చేయనున్నారు. శివరాంపల్లిలోని రాఘవేంద్ర మల్టీపర్పస్‌ కమ్యూనిటీ హాల్‌ రాష్ట్ర స్థాయి పోటీలకు వేదికగా నిలువనుంది. 2014 జనవరి 1 తర్వాత జన్మించిన ఫెన్సర్లు (కనీస వయసు 13 ఏండ్లు) ఈ టోర్నీలో పాటీపడేందుకు అర్హులు. ఫెన్సర్లు వ్యక్తిగత ఫెన్సింగ్‌ కిట్‌తో పోటీలకు రావాలని తెలంగాణ ఫెన్సింగ్‌ సంఘం కోశాధికారి సందీప్‌ కుమార్‌ జాదవ్‌ తెలిపారు.