
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ సార్వత్రిక పరీక్షలు ఫిబ్రవరి 28 నుండి మార్చి 14 వరకు జరగనున్నాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో నియోజక వర్గంలోని అశ్వారావుపేట,దమ్మపేట మండలాల్లో గల ప్రభుత్వ జూనియర్,ముస్లిం మైనార్టీ బాలికల,వీకేడీవీఎస్ రాజు జూనియర్,సాంఘీక సంక్షేమ శాఖ బాలురు మందల పల్లి,గిరిజన సంక్షేమ శాఖ బాలుర (దమ్మపేట),బాలికలు (అంకం పాలెం),ఏకలవ్య గురుకుల(గండుగులపల్లి) మొత్తం 7 జూనియర్ కళాశాలకు చెందిన మొత్తం 1771 మంది ప్రధమ – ద్వితీయ సంవత్సరాలు విద్యార్ధులు అశ్వారావుపేటలోని ప్రభుత్వ జూనియర్,ముస్లిం మైనార్టీ,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలల్లో ఏర్పాటు చేసిన మూడు పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు రాయ నున్నారు. ఇందులో ప్రధమ సంవత్సరం 829,ద్వితీయ సంవత్సరం 832,ప్రైవేట్ 90,ఒకేషనల్ 20 మంది మొత్తం 1771 మంది విద్యార్ధులు పరీక్షలకు హాజరు అవుతారు. ప్రభుత్వ జూనియర్,ముస్లిం మైనార్టీ,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలల్లో గల పరీక్షా కేంద్రాల్లో పరీక్షలు నిర్వహణకు చీప్ సూపరింటెండెంట్ లు,డిపార్ట్ మెంట్ ఆఫీసర్లు గా డి.నరసింహారావు,వెంకటేశ్వరరావు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.ఎస్ ప్రసాద్ లు నియమితులు అయ్యారు.