రేపటి నుండి ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు..

– రెండు పరీక్షా కేంద్రాలు…
– రోజు కు రెండు పరీక్షలు..
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు శుక్రవారం నుండి జరగనున్నాయి.ఈ నెల 24 వ తేదీ నుండి 31 వ తేదీ వరకు నిర్వహిస్తారు. ఉదయం 9 గంటలు నుండి 12 గంటలు వరకు మొదటి సంవత్సరం,సాయంత్రం 2.30 నుండి 5.30 వరకు ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తారు. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ప్రభుత్వ జూనియర్,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలల్లో ఈ పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలో 206 మంది,వీకేడీవీఎస్ రాజు జూనియర్ కళాశాలలో 140 మంది విద్యార్ధులు పరీక్షలు హాజరు కానున్నట్లు పరీక్షా కేంద్రాల చీప్ సూపరింటెండెంట్ లు,డిపార్ట్మెంట్ ఆఫీసర్ లు దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,ఎం.డి ముంతాజ్ అహ్మద్,ఎల్.శివ ప్రసాద్ లు తెలిపారు.