– నేటి నుంచి హైదరాబాద్‌లో మ్యాచ్‌లు
హైదరాబాద్ : ఆల్ ఇండియా ఫుట్‌బాల్ సమాఖ్య (ఏఐఎఫ్‌ఎఫ్), తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఇంటర్ కాంటినెంటల్ కప్ పోటీలకు గచ్చిబౌలి స్టేడియం ముస్తాబైంది. భారత్ సహా మూడు దేశాలు పోటీపడుతున్న ఇంటర్ కాంటినెంటల్ ట్రోఫీ నిర్వహణతో హైదరాబాద్‌ను మళ్లీ ఫుట్‌బాల్ కేంద్రంగా చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. నేడు తొలి మ్యాచ్‌లో భారత్, మారిషస్ పోటీపడుతుండగా.. 9న చివరి మ్యాచ్‌లో సిరియాతో భారత్ ఆడనుంది.