నవతెలంగాణ – జుక్కల్ : మండలంలోని పెద్ద ఎడ్గి గ్రామములో ఎల్ల అమావాస్య రైతుల పండుగ సంధర్భంగా కుస్తీ పోటీలను గ్రామస్తుల ఆధ్వర్యంలో గురువారం ఘణంగా గ్రామ సర్పంచ్ అస్పత్ వార్ వినోద్ భూమాతా పూజలు నిర్వహించి కుస్తీ పోటీలను ప్రారంబించారు. ఈ సంధర్భంగా గ్రామస్తులు గంగునాయక్ బృందం ఘణంగా ఏర్పాట్లు చేసారు. వివిధ గ్రామల నుండి ప్రజలు కుస్తీ పోటీలను తిలకించెందుకు భారీగా తరలిరావడంతో జనసందోహంతో నిండిపోయింది. ఆసక్తీకరంగా కుస్తీల పోటీలు ఒక వంద బహుమతితో చిన్న పిల్లల కుల్తీలను ప్రారంబించి పెద్ద కుస్తీ పదకొండు తులాల వెండి కడియం బహుకరించి ముగింపు చేసారు. జుక్కల్ పోలీసులు ఎటువంటి ఇబ్బందకరమైన సంఘటనలు జర్గకుండా ముందస్తు నుండి బారీగా బందోబస్తు నిర్వహించారు. ఖండోబా దేవుని పూజలు నిర్వహించిన అనంతరం జాతర భారీగా చేసారు. మండలంలోనే అతిపెద్ద జాతార ఇక్కడే జర్గుతుంది కాబట్టి సరిహద్దు గ్రామాల మహరాష్ట్ర , కర్ణాటక జనాలు తరలి రావడంతో జాతార జనసందోహంగా మారింది. మల్ల యేాదులు మూడు రాష్ట్రాల వారు కుస్తీ పోటిలలో పాల్గోని చూపరులకు అసక్తీకరంగా తిలకించారు.కార్యక్రమంలో సర్పంచ్ వినోద్, ఉపసర్పంచ్ ఖండేరావ్, పెద్దలు గంగునాయిక్ , సందీప్ నాయిక్, గణుపటేల్, సాయులు, రఘు, మాణిక్ పటేల్, డొంగ్లే బాబు తదితరులు పాల్గోన్నారు.