ఆసక్తికరంగా కాలం చెప్పిన కథలు

ఆసక్తికరంగా కాలం చెప్పిన కథలుఎస్‌.ఎం 4 ఫిలింస్‌ పతాకంపై బేబీ షాన్వీ, శ్రీ షాలిని సమర్పణలో సాగర్‌, వికాస్‌, అభిలాష్‌, రోహిత్‌, రవితేజ, హరి, శతి శంకర్‌, విహారిక చౌదరి, ఉమ, హాన్విక, పల్లవి రేష్మ ప్రధాన తారాగణంగా ఎం.ఎన్‌.వి.సాగర్‌ స్వీయ రచన, దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘కాలం చెప్పిన కథలు. ఈ చిత్ర టీజర్‌ విడుదల వేడుక బుధవారం ఫిల్మ్‌ ఛాంబర్‌లో జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన పీపుల్స్‌ మీడియా ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ శ్రీధర్‌ టీజర్‌ను విడుదల చేశారు. చిత్ర రచయిత, దర్శక, నిర్మాత సాగర్‌ మాట్లాడుతూ, ‘గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించిన ఈ ప్రేమకథలో ఫ్యామిలీ ఎమోషన్స్‌, సస్పెన్స్‌, భక్తి మిళితమై ఉంటాయి. మొత్తం 6 కథలు ఇందులో కలిసి ఉంటాయి. షూటింగ్‌ మచిలీపట్నం పరిసర ప్రాంతాల్లో చేశాం. సంగీత పరంగా కూడా మంచి క్యాచీ ట్యూన్స్‌ వచ్చాయి. 5 పాటలు ఉంటాయి. పోస్ట్‌ ప్రొడక్షన్‌ కూడా కంప్లీట్‌ అయ్యింది. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు ఈ చిత్రాన్ని తీసుకొస్తాం. మంచి కంటెంట్‌తో రూపొందిన ఈ సినిమా కచ్చితం విజయం సాధిస్తుంది’ అని తెలిపారు.