విజయ్ సేతుపతి, వెట్రీమారన్ కలయికలో రూపొందిన చిత్రం ‘విడుదల1’. ఈ చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌గా విజరుసేతుపతి, వెట్రీమారన్ కాంబినేషన్‌లోనే ‘విడుదల2’ తెరకెక్కింది. ఈనెల 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
ఈ చిత్ర తెలుగు హక్కులను శ్రీ వేదాక్షర మూవీస్ అధినేత చింతపల్లి రామారావు దక్కించుకున్నారు. ఆదివారం చెన్నైలో ఈ చిత్ర తెలుగు ట్రైలర్‌ను కథానాయకుడు విజరు సేతుపతి విడుదల చేశారు. పెరుమాళ్‌గా విజరుసేతుపతి పోరాట వీరుడిగా ఎలా మారాడు అనేది ఎంతో ఆసక్తికరంగా ఈ చిత్రంలో వెట్రీమారన్ ప్రజెంట్ చేశాడు.
ఈ సందర్భంగా నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ,’తెలుగునాట విజరు సేతుపతికి ఉన్న అభిమాన గణం ఎంతో బలంగా ఉంది. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం ఎంతో పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ఎమోషన్స్, యాక్షన్ అన్ని వాస్తవానికి దగ్గరగా ఉంటాయి. ఇళయరాజా సంగీతం ప్రధాన ఆకర్షణ. ‘పుష్ప-2′ ఎంతటి బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకుందో తెలిసిందే. ఆ కోవలోనే ఈ సినిమా కూడా అఖండ విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది’ అని అన్నారు.