
నవతెలంగాణ – అశ్వారావుపేట
ఈ ఏడాది ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు సోమవారం కు ఐదో రోజు కు చేరాయి. నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో ఏర్పాటు చేసిన ప్రభుత్వం జూనియర్,టి.ఎం.ఆర్,వీకేడీవీఎస్ ఆర్ జూనియర్ కళాశాలల్లో నీ మూడు పరీక్షా కేంద్రాల పరిధిలో ప్రధమ సంవత్సరం గణితం/వృక్షశాస్త్రం/రాజకీయ శాస్త్రం పరీక్షల లో మొత్తం 950 మంది విద్యార్ధులు పరీక్షలు రాయాల్సి ఉండగా,896 మంది విధ్యార్ధులు పరీక్షలకు హాజరు అయ్యారు.54 మంది విద్యార్ధులు గైర్హాజరు అయ్యారు.తహశీల్దార్ క్రిష్ణ ప్రసాద్,సీఐ జితేందర్,ఎస్.హెచ్.ఒ ఎస్ఐ లు శ్రీను,శివరామ క్రిష్ణ లు బందోబస్తు ను పర్యవేక్షించారు. ఈ పరీక్షా కేంద్రాలకు చీప్ సూపరింటెండెంట్,డిపార్ట్మెంట్ ఆఫీసర్ లుగా దామెర నరసింహారావు,అలవాల వెంకటేశ్వరరావు,రామయ్య,ఝాన్సీ,యేశోబు,ఎల్.శివప్రసాద్ లు విధులు నిర్వహిస్తున్నారు.
కేంద్రం ఎలాట్మెంట్ ఆబ్సెంట్ ప్రజెంట్
జి.జేసి 386 23 363
టిఎం ఆర్ జేసీ 169 11 158
వీకేడీవీఎస్ఆర్ జేసీ 395 20 375
మొత్తం 950 54 896