నవతెలంగాణ – తాడ్వాయి: వచ్చే నెల ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు జరుగు మేడారం మహా జాతరకు తాడ్వాయి నుండి ఎంట్రీ మేడారం నుంచి ఊరిలో నుండి ఊరటం స్తూపం వరకు ఐదు కిలోమీటర్ల రోడ్డును గత రెండు రోజుల నుండి ముమ్మరంగా పనులు నిర్వహిస్తున్నారు. ఆర్ అండ్ బి అధికారులు గుత్తేదారు దగ్గర ఉండి పనులు నాణ్యతగా ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకుని నిర్మిస్తున్నారు. గ్రామంలో ప్రధాన రహదారి కావడం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆర్టీసీ బస్టాండ్ లో దిగి కాలినడకన జంపన్న వాగు వెళ్లి పుణ్య స్థానాలు ఆచరించి గద్దెల వద్దకు చేరుకొని సాఫీగా దర్శనాలు చేయించుకునే విధంగా అన్ని చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. సందర్శకులు అధిక సంఖ్యలో వచ్చి వనదేవతలను దర్శించుకుని వారి వారి మొక్కులు చెల్లించుకుని వెళ్లాల్సిందిగా కోరారు.