– పట్టించుకోని పాలకులు
– ఇబ్బందులు పడుతున్న ప్రజలు
నవతెలంగాణ- సంస్థాన్ నారాయణపురం
మునుగోడు నియోజకవర్గం లోనీ పలు గ్రామాలకు వెళ్లే అంతర్గత(లింకు)రోడ్లు అద్వానంగా మారాయి.పట్టించుకోవాల్సిన పాలకులు,అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. నిత్యం ఈ రోడ్లపై వెళ్లాల్సిన వారికి ఇబ్బందులు తప్పడం లేదని ప్రజల ఆరోపిస్తున్నారు.పెద్ద గుంతలు పడడంతో ప్రజలకు,ప్రయాణికులకు వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.వర్షాలు పడితే చాలు కొన్ని రోడ్లు బురద మడులను తలపిస్తున్నాయి.మరికొన్ని రోడ్లు అయితే వాహనాలు కూడా వెళ్లలేని దుస్థితిలో ఉన్నాయి.అనేకమంది ఈ రోడ్ల వెంట వెళ్తూ ప్రమాదాలకు గురైన గాయాల పాలైన సంఘటనలు లేకపోలేదు.కొన్ని రోడ్లపై వెళ్లేవారు పాయింట్ పైకి మల్చుకొని,చెప్పులు చేతుల పట్టుకుని మోటార్ సైకిల్ ను నెట్టుకుంటూ వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది.ఎన్నికల అప్పుడు హామీలు ఇవ్వడం తర్వాత మర్చిపోవడం ఈ ప్రాంత ప్రజా ప్రతినిధులకు,రాజకీయ నాయకులకు సర్వసాధారణమైందనీ ప్రజలు విమర్శిస్తున్నారు.ఉప ఎన్నికల్లో గెలుపొందిన ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గ్రామాల్లో సిసి రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నప్పటికీ పలు గ్రామాలకు వెళ్లే అంతర్గత రోడ్లను పట్టించుకోవడంలేదని పలువురు విమర్శిస్తున్నారు.కొన్ని రోడ్లకు నిధులు మంజూరైనప్పటికీ పనులు ప్రారంభించని పరిస్థితి నెలకొంది.సాధారణ ఎన్నికలు సమీపిస్తుండడంతో మంజూరైన రోడ్లు మరమ్మత్తు అయ్యేనా అని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నియోజకవర్గంలో బాగు చేయాల్సిన అంతర్గత రోడ్లు
నారాయణపురంలో… సర్వేలు ఆర్ అండ్ బి రోడ్డు నుండి గొల్లగూడెం మీదగా కాట్రేవ్ ఆరెగూడెం , చిమీర్యాల నుండి కోతుల పురం,గుజ్జ నుండి చలిమెడఅల్లం దేవి చెరువు నుంచి నాగవారిగూడెం మీదుగా శేర్గూడెం వరక, .నారాయణపురం నుంచి దుబ్బల్లగూడెం,మహ్మదాబాద్ నుంచి దుబ్బల్ల గూడెం,చిమిర్యాల నుంచి సుద్దబాయిగూడెం మీదగా నారాయణపురం,సర్వేలు అడ్డరోడ్డు నుంచి ఎర్రగుంట చిట్టన్న బాయి మీదుగా కొత్తగూడెం అడ్డరోడ్ వరకు, కొత్తగూడెం నుంచి జనగాం అడ్డరోడ్డు వరకు,మల్లారెడ్డిగూడెం నుంచి లింగవారి గూడెం వరకు,వాయిలపెళ్లి నుంచి గట్టుప్పల్ వరకు, వాయిల పెళ్లి నుంచి గొల్లగూడెం, జనగాం నుంచి వాచ్యాతండా, పొర్లగడ్డ తండా నుంచి గరికతండా ఐదుదోనాల తండా నుంచి కడీలబ్బాయి తాండవరకు బాగు చేయాల్సి ఉంది.
మునుగోడు మండలంలో.. కొంపల్లి నుంచి కలకుంట్ల,.కొంపల్లి నుంచి కోతులారం పిడబ్ల్యు రోడ్డు వరకు,కల్వలపల్లి నుంచి గూడపూర్,కల్వలపల్లి నుంచి అంగడిపేట,కలవలపల్లి నుంచి ఔరవాణి,కలవలపల్లి నుంచి బ్రాహ్మణపల్లి వరకు, పులి పలుకుల నుంచి ఊకోండి,పులిపలుపుల నుంచి సింగారం,పులిపలుపుల నుంచి రత్తేపల్లి,బీరెల్లి గూడెం వరకు, రత్తిపెళ్లి నుంచి ఎలికట్టె, సింగారం నుంచి కచలాపురం, కొరటికల్ నుంచి రేగట్టే , కొరటికల్ నుంచి సిరితపల్లి ,కొరటికల్లు నుంచి దుబ్బ కాలువ,లక్ష్మీదేవి గూడెం మీదగా మునుగోడు రోడ్డు వరకు, కొంపల్లి నుంచి కోతులారం, కోతులారం నుంచి కిష్టాపురం, తాళ్లెంలో నుంచి ఇప్పర్తి .ఎల్లలగూడెం నుంచి జక్కలివారిగూడెం, రామకష్ణాపురం నుంచి సోలిపురం (రోడ్డు,కల్వర్టు), చండూరు పీడబ్ల్యూ రోడ్డు నుంచి సానబండ వరకు, నల్గొండ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి గుండ్లోని గూడెం వరకుచేయాలి.
చండూరు మండలంలో…
నేర్మట నుంచి గొల్లగూడెం,నేర్మట నుంచి శేరి గూడెం,నేర్మట నుంచి లంకలపల్లి, తాస్కాన్ గూడెం నుంచి శిర్ద్దెపల్లి, తాస్కాన్గూడెం నుంచి పుల్లెంల అడ్డ రోడ్డు వరకు. పుల్లెంల నుంచి బోడంగపర్తి,పుల్లెముల నుంచి నెర్మట, తిమ్మారెడ్డి గూడెం నుంచి తుమ్మలపల్లి, బోడంగిపర్తి నుంచి సోలిపురం, చండూర్ ఆర్ అండ్ బి రోడ్డు నుంచి దుబ్బగూడం, గుండ్రపల్లి నుంచి తుమ్మలపల్లి,గుండ్రపల్లి నుంచి సామలపల్లి వరకు చౌటుప్పల్ మండలంలో….చౌటుప్పల్ జాతీయ రహదారి నుంచి తాళ్ల సింగారం వరకు, తాళ్ల సింగారం నుంచి చౌటుప్పల్, జాతీయ రహదారి నుంచి కొయ్యలగూడెం, నాగారం మీదగా పీపల్ పహాడ్ వరకు, పీపల్ పహాడ్ నుంచి ఎల్లాయి గుట్ట అడ్డరోడ్ వరకు, అల్లాపురం నుంచి సరళ మైసమ్మ గుడి వరకు గట్టుప్పల్ మండలంలో..తేరేట్‌పల్లి నుంచి నామాపురం,తెరట్టుపల్లి నుంచి వెల్మకన్నె వరకు. కొట్టాల నుండి శివన్న గూడెం. కమ్మగూడెం నుంచి శేరిగూడెం,శేరిగూడెం నుంచి నామాపూరం వరకు,నామాపురం నుంచి లంకలపల్లి,నామాపురం నుంచి అంతంపేట వరకు, వెల్మకన్నె నుంచి కల్వకుంట్ల, గట్టుపల్ నుంచి పుట్టపాక, కమ్మ గూడెం నుంచి వెల్మకన్నె వరకు, మర్రిగూడెం మండలంలో… మేటిచంద్రాపురం(ఇందుర్తి)నుండి లెంకలపల్లి రోడ్డు వరకు, మేటిచంద్రాపురం స్కూల్ నుండి అంతంపేట వరకు, సరంపేట నుండి సరంపేటతండా,తండా నుండి దామెర భీమనపల్లి వరకు, లెంకలపల్లి నుంచి పాకగూడెం మీదగా పాత చంద్రపురం వరకు, రామ్రెడ్డి పల్లి నుంచి చర్లగూడెం రోడ్డు వరకు, కొండూరు నుండి తండా మీదుగా కిష్టరాయపల్లి రోడ్డు వరకు, కొండూరు నుండి గుట్ట మీదగా తండ వరకు, తిరగండ్లపల్లి నుంచి నరసింహపురం గేట్ వరకు, తుమ్మలపల్లి నుంచి అజ్మాపురం, కేబిపల్లి నుండి సాయిబండ తండా వరకు, సాయి బండ తండా నుండి అంతంపేట వరకు, శివన్నగూడెం సబ్ స్టేషన్ నుండి సరంపేట వరకు, తాందారుపల్లి నుంచి వట్టిపల్లి వరకు, కొండూరు నుండి గేటు వరకు, మర్రిగూడెం ఎంపీడీవో కార్యాలయం నుండి వట్టిపల్లి వరకు, వట్టిపల్లి నుండి పాతబట్లపల్లి వరకు, కేబిపల్లి హరిజనవాడ నుండి శివన్న గూడెం వరకు,అంతంపేట గ్రామపంచాయతీ నుండి హరిజన తండా మీదగా నామాపురం వరకు,కొట్టాల స్కూల్ నుంచి అంతంపేట వరకుబాగు చేయాల్సి ఉంది.