
మారుతున్న జీవన శైలిలో భాగంగా భూభాగం మరింత వేడికి గురవుతోంది. తద్వారా ఎన్నో జీవజాతులు అంతరించిపోయి జీవ వైవిధ్యం దెబ్బతింటోంది. పర్యావరణ పరిరక్షణ ద్వారా అరుదైన జీవరాశులను కాపాడి, జీవ వైవిధ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. దీనికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిన సంగతి తెలిసిందే.. రండి ప్రభుత్వానికి తోడ్పాటునందిస్తూ జీవవైవిధ్యాన్ని పరిరక్షించుకునే బాధ్యత అందరికి ఉంది అంటూ వైష్ణవి కన్ స్ట్రక్షన్స్, బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండు రంగారెడ్డి నియోజకవర్గం ప్రజలకు బుధవారం అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం సందర్బంగా పిలువు నిచ్చారు.