జనవరి ఏడాదిలో మొదటి నెల మాత్రమే కాదు, అంతర్జాతీయ సృజనాత్మకతా మాసం (International Creativity Month) కూడా. మానవాళికున్న ఇచ్ఛా క్రియా జ్ఞానశక్తుల వెలికితీతనూ వ్యక్తీకరణల అవసరాన్ని గుర్తిస్తూ జనవరిని అంతర్జాతీయ సృజనాత్మకతా మాసంగా రాండాల్ మున్సన్ ప్రతిపాదించారు. న్యూయార్క్‌కు చెందిన ఈయన సుప్రసిద్ధ వక్త, ఎంటర్‌టైనర్, ఎడ్యుకేటర్, ప్రపంచ ప్రఖ్యాత బిజినెస్ మెంటర్.
“Creativity allows us to view and solve problems more openly and with innovation. Creativity opens the mind. A society that has lost touch with its creative side is an imprisoned society, in that generations of people may be closed minded. It broadens our perspectives and can help us overcome prejudices.”
– JESSICA CARSON
Freelance trainer, Artist, Consultant , Programer of Creativity And Change.
రాండాల్ మున్సన్ రాసిన ‘క్రియేట్ బిజినెస్ బ్రేక్ త్రూ యు వాంట్, హ్యూమర్ 101, క్రియేటివిటీ 102’ లాంటి పదకొండు గ్రంథాలు అత్యధికంగా అమ్ముడైనాయి. ప్రజలు తమ కంఫర్ట్ జోన్ల నుంచి బయటపడి దైనందిన జీవితంలో వినూత్నంగా ఉండటానికి తమకు తాము ప్రేరణగా నిలవడానికి తార్కాణంగా ఒక నెల ఉండాలని, అదీ ఏడాది ఆరంభంలోని మొదటినెల అయితేనే మిగతా పదకొండు నెలలు స్ఫూర్తిదాయకం నిర్మాణాత్మకంగా ఫలవంతంగా గడుస్తాయనే ఉద్దేశంతో మున్సన్ పండితుడు అంతర్జాతీయ సృజనాత్మకతా మాసాన్ని ఖాయం చేశాడు.
పునరుజ్జీవనోద్యమ యుగంలో చింతనాపరులు వ్యక్తి తన స్వేచ్ఛను ప్రకటించుకోవడాన్ని సృజనాత్మకతగా భావించారు.ఈ ప్రయత్నంలో సృజనాత్మకత అనే పదాన్ని మొదటిసారిగా వినియోగించింది పదిహేడో శతాబ్దానికి చెందిన పోలెండుకవి మాసీజ్ కజిమియర్జ్ సర్బివ్స్కీ.కానీ ఈయన సృజనాత్మకతను కవిత్వానికి మాత్రమే పర్యాయపదంగా చెప్పాడు. సైన్సు మాదిరిగానే క్రియేటివిటీ కూడా ఒకటిన్నర శతాబ్దం కాలంగా అనేక ప్రతిఘటనలను ఎదుర్కొంటూ వచ్చింది. సృష్టి (జతీవa్‌వ) అనే పదం ‘శూన్యం నుంచి సృష్టికి’ అనే ఆధ్యాత్మిక విషయంగా మనుషుల మెదళ్లలో పాదుకొని ఉండటమే ఇందుకు కారణం. దేవుడికే సృష్టి సాధ్యమన్న నానుడి పోయి, మనుషుల ఇచ్ఛాక్రియాజ్ఞానశక్తుల నైపుణ్యమే ‘సృష్టి’ అనే నిర్వచనం బలపడటానికి డార్విన్‌తో సహా ఎందరో భౌతికవాదులు ఎంతగానో శ్రమించారు.
సృజనాత్మకతకు ఆంగ్లంలో Creativity సమానార్థకం. Creativity is the ability to form novel and valuable ideas or works using oneµs imaginationµ అనేది నిర్వచనం. ‘Creare’ అనే లాటిన్ పదం creativity కి ధాతురూపం. దేవుడు విశ్వ సృష్టిచేయడం అని లాటిన్‌లో అర్థం. భగవంతుని అనితర సాధ్యమైన శక్తి అనే అర్థంలో క్రియేటివిటీని క్రీ.శ. 5వ శతాబ్దం వరకు ప్రపంచం బలంగా నమ్ముతూ వచ్చింది. పద్నాలుగో శతాబ్దానికి చెందిన ఆంగ్ల సాహిత్య పితామహుడుగా కీర్తిగడించిన చాసర్ పండితుడు మొదటిసారి తన ‘Parsonµs Tale’ గ్రంథంలో క్రియేటివిటీ పదాన్ని ప్రయోగించాడు. చిత్రకారులైన మెఖేలాంజేలో, లియో నార్డో డావిన్సీ తమ కళాఖండాల సృష్టిని సృజనాత్మకతగా సంబోధించారు. అయినా పదిహేడో శతాబ్దం దాకా దైవిక సంబంధిగానే సృజనాత్మకతను ఆధ్యాత్మికులు ప్రవచిస్తూ వచ్చారు.
సృజనాత్మకతకు దైవసృష్టికి ఎంతమాత్రం సంబంధం లేదని, అసాధారణ ప్రతిభ కలిగిన కొందరు వ్యక్తులకు మాత్రమే సాధ్యపడే మహత్కార్యం (Great Work) గా ప్రజలకు అర్థంకావడానికి సైన్సు వ్యాప్తిలోకి వస్తే కానీ రూఢి కాలేదు. గత శతాబ్ది ఆరంభంలో మనోవిజ్ఞాన శాస్త్రవేత్త సిగ్మండ్ ఫ్రాయిడ్ ”Creativity is an extreme of struggle between the ego and super-ego” అంటూ సజనాత్మకతను మరింతగా ప్రజాస్వామికీ కరించాడు. 1950 కల్లా శాస్త్రవేత్తల తమ ప్రయోగాలు ‘వ్యక్తుల భిన్నమైన ఆలోచనా సరళయే సృజనాత్మకతకు మాతృక’ అని నిరూపించాయి. బ్రాండీ ఎజబెక్ మొదలైన ఆధునిక డిజైనర్లు సృజనాత్మకతను 3 P’s (Play, Process, Product) ల సమాహారంగా విశ్లేషించారు. సృజనాత్మక వ్యక్తులు మనకు అరుదుగా కనిపిస్తుంటారు. ప్రపంచాన్ని తాజా కళ్లతో చూడగలగడమే సృజనకారుల లక్షణం.అయితే, సృజనాత్మకత సహజమైంది, దాన్ని పనిగట్టుకొని పెంపొందించలేం, అది కొంతమంది అదృష్టవంతులకు మాత్రమే ఉంటుంది అనేది దురభిప్రాయం. అభ్యాసం, శిక్షణ ద్వారా సృజనాత్మకతను పెంపొందించుకోవచ్చును.
సృజనాత్మక ఆలోచనకు ‘ప్రశ్నను లేదా సమస్యను నిర్ధారించుకోవడం ((Forming a question/problem), పరిశోధన (Research), గడువు లేదా పరిమితి విధించుకోవడం (Basta : knowing when to stop researching), ఆరంభం నుంచి ముగింపు వరకు బుద్ధిని సారవంతంగా ఉంచుకోవడం (Gestation), ఆవిష్కరణకు (The “Eureka” moment), భౌతిక రూపమివ్వడం (Physically making/creating), పరీక్షకు నిలపడం (Testing/ criticism/ sharing)’ అనే ఏడు మార్గాలను TED X స్పీకర్ Rapheal Diluzio సూచించాడు. ఈయన మార్గాన్నే Seven Stages of The Creative Process అంటూ Intending, Incubating, Investigating, Composing, Deepening, Completing, Going Public అనే అర్థాల్లో క్రియేటివ్ డిజైనింగ్ నిపుణులు సమర్థించారు. మనస్తత్వశాస్త్రవేత్తలు ‘అన్వేషణాత్మక (exploratory), పరివర్తన (transformational), సంసర్గ (combinational)’ అనే మూడు విభాగాల్లో సృజనాత్మకత విస్తరించి ఉంటుందన్నారు.
విద్య అన్నిరంగాల్లోకెల్లా డైనమిక్ ఫీల్డ్, నీరసంగా నిర్జీవంగా ఉండకూడదు.బోధన ఎప్పటికప్పుడు తాజాగా ఉంటూ పురోగతిని సాధిస్తూ, సాంస్కృతిక మార్పులు చేసుకుంటూ, సాంకేతిక ఆవిష్కరణలతో కొత్తపుంతలు తొక్కినపుడే సృజనాత్మకత వర్ధిల్లగలదు. సృజనాత్మకతే వ్యక్తుల సక్సెస్ కు ప్రబలసాధనం. వ్యక్తికి కొద్దిపాటి సృజనాత్మకత ఉంటే చాలు, సమస్యలు ఎక్కడిక్కడ మటుమాయ మవుతాయి. అందుకని సృజనాత్మకతను ఎవరూ ఎప్పుడూ తక్కువగా చూడరాదు. How To Be More Creative At Work: 20 Ways To Spark Innovation అనే తన పరిశోధనా పత్రంలో ”Creativity is not just a buzzword. And itµs not just a »nice-to-haveµ trait in the workplace. Workplace creativity is a powerful force that drives innovation, problem-solving, and overall success.” అంటూ ప్రముఖ బిహేవియరల్ సైంటిస్ట్ జాసన్ హ్రేహా వ్యక్తులకూ సంస్థలకూ గల సృజనాత్మకత ఆవశ్యకతను నొక్కి చెబుతాడు.జీవితంలో ప్రతిఒక్కరికీ ఎప్పుడో ఒకటి ఏదో ఒక కొత్త సమస్య ఎదురవుతూనే ఉంటుంది. అప్పుడు కొత్త పరిష్కారాలు అవసర మవుతాయి. అందుకే పిల్లలకు సృజనాత్మకంగా ఆలోచించడం, పనిచేయడం, సజనాత్మకతా దశలపట్ల అవగాహన ఉపాధ్యాయులు నేర్పించవలసి వుంది. కోర్సు ముగిసేలోగా కడపటి ప్రేరణ (Final inspiration) కల్పిస్తూ, విద్యార్థులను యువతనూ Fine-tune చేయవలసిన బాధ్యత విద్యాలయానిదే. విద్యార్థులను మైండ్ ఫ్రీగా ఉంచడం, ఆనకట్ట లేని నదివలె ఆలోచనలతో ప్రవహించేలా రూపొందించడం, భవిష్యత్తుకు సంబంధించి విశిష్టమైన ప్రత్యేక వ్యక్తీకరణలు వెల్లువెత్తేలా అమర్చడం.
కాలం కంటే ముందుంచడం ఒక్క సృజనాత్మకత మూలంగానే సాధ్యం. ప్రపంచ గమనంలో పరిణామాలు సర్వసాధారణం. సి.యస్. లూయిస్ ఉద్ఘాటించినట్టు-
“Lead us , Evolution,lead us
Up the futureµs endless stair:
Chop us,change us,prod us,weed us.
For stagnation is despair:
Gropping, guessing, yet progressing,
Lead us nobody knows where”
కాలగతిలో తప్పనిసరిదైన పరిణామంలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఉండాల్నో తేల్చేది, తట్టుకొని నిలబడే శక్తినిచ్చేది ఒక్క సృజనాత్మకత మాత్రమే. ఇందుకు కొత్త ఏడాదిలో మొదటిదైన జనవరి నెల నుంచే అందరి జీవితాల్లో సృజన స్థాపన జరగాలన్నదే అంతర్జాతీయ సృజనాత్మకతా మాసంలోని ఆంతర్యం, దిశానిర్దేశం. నిన్నమొన్నటి వరకు కళలు, సాహిత్యం సృజనాత్మకతా రంగాలు. నేడు అన్ని రంగాలకూ సృజనాత్మకత అనుసంధానించబడింది. సేవలు ఉత్పాదకతా రంగాల్లో సైతం సృజనాత్మకతనే వినియోగదారులు కోరుకుంటున్నారు. అందిపుచ్చుకొని జీవితాన్ని మేధోవంతం సంపద్వంతం చేసుకోపడానికై ఉద్యుక్తులు కావలసింది వర్తమాన తరమే.
– డా.బెల్లి యాదయ్య, 9848392690