అంతర్జాతీయ స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం

నవతెలంగాణ -పెద్దవూర: ప్రతి ఏడాది నవంబర్ 25 న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినము జరుపుకుంటారని స్త్రీ లేకపోతే జననం లేదు.. స్త్రీ లేకపోతే గమనం లేదు. స్త్రీ లేకపోతే సృష్టిలో జీవం లేదు. స్త్రీ లేకపోతే అసలు సృష్టే లేదని బుసిరెడ్డి పౌండేషన్ ఛైర్మెన్ పాండురంగారెడ్డి అన్నారు. సోమవారం అంతర్జాతీయ స్త్రీ హింసా దినోత్సవం సందర్బంగా ఆయన నవతెలంగాణ తో మాట్లాడారు.అమ్మను పూజించాలి, భార్యను ప్రేమించాలి, సోదరిని దీవించాలి, ముఖ్యంగా స్త్రీలను గౌరవించాలి. ఇది మన సాంప్రదాయం అని తెలిపారు. మరి స్త్రీలపై ముక్కుపచ్చలారని బాలికపై యువతులపై, వృద్ద మహిళలపై ఎలాంటి దారుణానికి పాల్పడుతున్నారో రోజు వార్తల్లో చూస్తూనే ఉన్నాం. ఇలాంటి ఆగడాలను ఆపడానికే స్త్రీ హింసా వ్యతిరేక దినంను తీసుకొచ్చారని అన్నారు.