లింగవివక్షత లేకుండా బాలబాలికలకు రాజ్యాంగం సమాన హక్కులను కల్పించిందని డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య అన్నారు. శుక్రవారం లిటిల్ స్టార్ స్కూల్ లో అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని నిర్వహించారు. దీనికి ఆమె ముఖ్య అథితిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా డీఎల్ఎస్ఏ కార్యదర్శి సౌజన్య మాట్లాడుతూ.. బాలబాలికలకు రాజ్యాంగం సమాన హక్కులను కల్పించిందన్నారు. లింగ వివక్షత లేకుండా అవగాహన కార్యక్రమాలను ముమ్మరంగా చేపడుతున్నామన్నారు. చిన్నారుల కోసం డీఎల్ఎస్ తరపున ప్రత్యేక యూనిట్ను ఏర్పాటు చేశామన్నారు. పోలీసు స్టేషన్కు వేళ్లి ఫిర్యాదు చేయడానికి బయపడే వారు డీఎల్ఎస్ఏను సంప్రదించాలన్నారు. విద్యాతోనే అన్ని సాధ్యమవుతాయని, ఆ దిశగా విద్యార్థులు కష్టపడి చదవలన్నారు. క్రమశిక్షణ కూడా చాల ముఖ్యమని, భవిష్యత్తులో ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ జీవన్ రెడ్డి, పీపీలు రమణ రెడ్డి, మధుకర్, వన్ టౌన్ సీఐ సునీల్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ కమలకర్ రెడ్డి ఉన్నారు.