అంతర్జాతీయ మెడిటేషన్ దినోత్సవం సందర్భంగా మండలంలోని చౌట్ పల్లిలోని కోటిలింగేశ్వర ఆలయంలో స్థానిక ప్రాథమిక పాఠశాల విద్యార్థులు, సిబ్బంది ఆధ్వర్యంలో ధ్యానం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త గంగా ప్రసాద్ మెడిటేషన్ వల్ల ఏకాగ్రత లభిస్తుందని, విద్యార్థులకు చిన్న వయసు నుండి మెడిటేషన్ అలవర్చడం వల్ల బహుళ ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు.ప్రతి ఒక్కరు ప్రతిరోజు కనీసం అరగంట అయినా ధ్యానం చేయాలని, మానసిక ప్రశాంతత కూడా చేకూరుతుందన్నారు. ధ్యానం ద్వారా మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు అన్నారు. కార్యక్రమంలో ఐకెపి ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కుంట గంగాధర్, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థులు పాల్గొన్నారు.