నవతెలంగాణ – అశ్వారావుపేట
మారుమూల గిరిజన ప్రాంతం అయిన నియోజక వర్గం కేంద్రం అయిన అశ్వారావుపేట లో సైతం అంతర్జాతీయ వ్యాపార సంస్థలు పునాది వేసుకుంటున్నాయి. పట్టణంలోని జంగారెడ్డిగూడెం రోడ్ లో పూర్వ వెంకటేశ్వర ఫంక్షన్ హాల్ స్థానంలో నూతనంగా నిర్మించిన రిలయన్స్ స్మార్ట్ పాయింట్ ను శుక్రవారం స్థలం యజమాని,అశ్వారావుపేట జెడ్.పి.టీ.సీ పూర్వ సభ్యులు అంకత మల్లికార్జున్ రావు తో పాటు రిలయన్స్ స్మార్ట్ పాయింట్ మేనేజర్ పవన్ కుమార్ లు ప్రారంభించారు. ఇప్పటికే పట్టణంలో ట్రెండ్స్ వస్త్ర దుకాణం వ్యాపారం సాగిస్తుంది. అపోలో, మెడి ప్లస్ లాంటి కార్పోరేట్ ఔషధ దుకాణాలు వాటి బ్రాంచ్ లను ఇక్కడ ఏర్పాటు చేయడంతో పట్టణ పౌరులు కార్పోరేట్ సంస్క్రుతికి అలవాటు పడుతున్నారు.