అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను విజయవంతం చేయాలి

– ఆర్జీ-3 ఏరియా సేవా అధ్యక్షురాలు ఎన్ అలివేణి 
నవతెలంగాణ – రామగిరి
ఆర్ జి-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో ఈనెల 11 వ తేదీన సెంటినరీ కాలనీలోని కమ్యూనిటీ హాలులో  సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో మహిళలు అధిక సంఖ్య లో పాల్గొని విజయవంతం చేయాలని ఆర్జీ-3 ఏరియా సేవా అధ్యక్షురాలు ఎన్ అలివేణి సుధాకర్ రావు, ఏపీఏ, జీఎం సతీమణి  కె విజయలక్ష్మీ వెంకటేశ్వర్లు కోరారు. మంగళ వారం సెంటినరీ కాలనీలోని సేవా భవన్ లో సేవా సభ్యులతో మహిళా దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో వారు మాట్లాడుతూ..మార్చి-8 వ తేదీ అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకుని, ఈనెల 11వ తేదీన స్థానిక కమ్యూనిటీ హాల్ లో ఉదయం10:00 గంటలకు వేడుకలు నిర్వహించబడునని, వేడుకలలో భాగంగా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడునని, ఈ సందర్భంగా రామగుండం-3 & అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలో మహిళలకు నిర్వహించినటువంటి వివిధ ఆటల పోటీల విజేతలకు బహుమతి ప్రధానం చేయబడునని అన్నారు. కాబట్టి సేవా సభ్యులు, సింగరేణి ఉద్యోగుల కుటుంబ మహిళలు, కాలనీ మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని ఈ వేడుకలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం లో  పర్సనల్ మేనేజర్ ముప్పిడి రవీందర్ రెడ్డి,  కోఆర్డినేటింగ్ అధికారి గుర్రం శ్రీహరి, సేవా కార్యదర్శి మల్లీశ్వరి, సంయుక్త కార్యదర్శి ఉమాదేవి, సేవా కోఆర్డినేటర్ బి రాయమల్లుతో పాటు సేవా సభ్యులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.